Mana Aksharam
  • Home
  • News
  • ప్రజల్లో చేతన్య దీపికా. ఓ జంట పెళ్లి పత్రిక.
Andhra Breaking National News Politics

ప్రజల్లో చేతన్య దీపికా. ఓ జంట పెళ్లి పత్రిక.

ఓటు హక్కుపై ప్రజల్లో అవగహన కల్పించేందుకు ఓ జంట తమ పెళ్లి పత్రిక ను సరికొత్తగా ఎన్నికల గుర్తింపు కార్డులా ప్రచురించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ధార్వాడలో బెస్కాం అధికారి మంజునాథ్‌ కుమారుడు సునీల్‌కు, హెస్కాంలో పనిచేస్తున్న మరో ఇంజనీర్‌ మహేశ్‌ సోదరి అన్నపూర్ణలకు వివాహం నిశ్చయించారు. ఈనెల 26న వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్ తరుణంలో ఓటు ప్రాధాన్యత, ఓటు హక్కు వినియోగం ఆవశ్యకతను తెలియజేయడానికి ఈ కాబోయే జంట తమ పెళ్లి కార్డును ఓటరు కార్డుల ముద్రించి అందరికి ఆహ్వానం పంపారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని అందులో పేర్కొన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ నూతన జంటను అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్డు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది

Related posts

టీడీపీలో పార్టీ పదవుల పందేరం!

admin

జగన్ ప్లాన్ బి ఇదేనా?

admin

ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలు

Masteradmin