Mana Aksharam
  • Home
  • News
  • Crime
  • ప్రేమోన్మాది ఘాతుకానికి మరో ఆడపిల్ల బలి
Crime News Telangana

ప్రేమోన్మాది ఘాతుకానికి మరో ఆడపిల్ల బలి

women suicides by having poison

నగరంలో అతి దారుణ, అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఘాతుకానికి కళ్లేదుటే కన్నకూతురు కన్నుమూసింది. విషం తాగిన ప్రేమికురాలిని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్సకు చేర్చి.. ఆమె కన్నవారికి సమాచారం ఇచ్చి పరారయ్యాడు సదరు ప్రేమికుడు. మరోవైపు ఆస్పత్రిలో యువతి ప్రాణాలు నిలుపుతామన్న వైద్యులు.. తమకు బిల్లు మొత్తం కట్టేసి మృత దేహాన్ని తీసుకువెళ్లాలని తేల్చి చెప్పేసారు. దీంతో దిక్కు తోచని నిరుపేద తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇక వివరాల్లోకి వెళ్తే…

మెదక్ జిల్లా కొహెడ మండలం, మైసంపల్లికి చెందిన లక్ష్మణ్ కుమార్తె జ్యోతి డిగ్రీ పూర్తి చేసింది. హైదరాబాద్ నగరంలో ఉద్యోగం చేసేందుకు వచ్చి బేగంపేట్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తూ కేబీహెచ్‌పీ కాలనీలోని 4వ ఫేజ్‌లో నివాసం ఉంటోంది. కాగా జ్యోతి ఊరికి సమీప గ్రామంలో నివసించే రాకేష్ రెడ్డి తనను ప్రేమించాలంటూ జ్యోతి వెంట కొన్ని రోజులుగా వెంట పెడ్తున్నాడు. ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి రాకేష్ రెడ్డిని మందలించాడు. అయినా రాకేష్ తీరు మార్చుకోకుండా వేధింపులు కొనసాగించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జ్యోతి సోమవారం రాత్రి కూల్ డ్రింక్‌లో విషం కలుపుకుని తాగింది. ఈ విషయం తెలుసుకున్న రాకేష్.. ఆమెను కూకట్పల్లిలోని అనుపమ ఆస్పత్రిలో చేర్చాడు. జ్యోతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అక్కడినుండి పరారయ్యాడు.

ఆస్పత్రికి చేరుకున్న జ్యోతి తల్లిదండ్రులు కుమార్తెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే చికిత్స మొదలెట్టిన వైద్యులు.. ఆమె ప్రాణాలకు ముప్పు లేదని అన్నారు. లక్షణ్‌తో రూ. 16వేలు డిపాజిట్ చేయించుకున్నారు. చికిత్స పొందుతున్న జ్యోతి మృతి చెందింది. మిగిలిన రూ. 20 వేలు బిల్లు చెల్లించి.. మృత దేహాన్ని తీసుకెళ్లమని చెప్పారు ఆస్పత్రి సిబ్బంది. దీంతో దిక్కు తోచని స్థితిలో వారు ఆందోళనకు దిగారు. రంగప్రవేశం చేసిన పోలీసులు జ్యోతి మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న రాకేష్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.

Related posts

అమెరికాకు మోడీ.. హెచ్1బీ వీసా అంశంపై చర్చలు..

admin

అలాంటి పక్షులను నమ్మను : పవన్ కళ్యాణ్

admin

కేశినేని నానిపైన పీవీపీ సెటైర్స్

Manaaksharam