Mana Aksharam
  • Home
  • Manavi
  • ఫౌండేషన్ ముఖానికి ఎక్కువగా వేసుకుంటే..ఏం జరుగుతుందో తెలుసా?
Beauty Health Manavi

ఫౌండేషన్ ముఖానికి ఎక్కువగా వేసుకుంటే..ఏం జరుగుతుందో తెలుసా?

what happens to face with more foundation

అందరు అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం మేకప్ కిట్ ల వాడకం ఎక్కువైపోతోంది. ఈ కాలంలో లిప్‌స్టిక్‌ వేసుకోవడం చాలా సులువైపోయింది. కొందరైతే ఎప్పుడూ లిప్‌స్టిక్ వేసుకునే ఉంటారు. లిప్‌స్టిక్ వేసుకోవచ్చు.. కానీ, అదేపనిగా వాడడం అంత మంచిది కాదు. ఎందుకంటే.. రోజూ లిప్‌స్టిక్ రాసుకున్నప్పుడు పెదాలపై తేమ తొలగిపోయి పొడిబారి పగులుతుంటాయి. అందువలన లిప్‌స్టికి తుడుచుకున్న తరువాత కొద్దిగా తేనెను పెదాలను రాసుకోవాలి. ఇలా చేస్తే పెదాలు తేమను కోల్పోకుండా ఉంటాయి.

ఫౌండేషన్, కన్సీలర్, పౌడర్ వీటితోనే కదా ముఖానికి మేకప్ వేసుకుంటాం.. వీటిని వాడడం వల్ల చర్మం పై రంధ్రాలను మూసేస్తాయి. ఇలా మూసుకున్నప్పుడు ముఖం ముడతలుగా  తయారవుతుంది. దాంతో మెుటిమలు, నల్లటి వలయాలు వస్తుంటాయి. అందుకు మేకప్ శుభ్రం చేసుకునేటప్పుడు ముఖాన్ని క్లెన్సర్‌తో కడుక్కుంటే మంచి ఫలితం లభిస్తుంది.

మస్కారా, ఐషాడో, కాజల్ వంటి పదార్థాలన్నీ కంటి అందానికి ఉపయోగిస్తుంటాం. ఇవి కంటి అందాన్ని రెట్టిపు చేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ రోజంతా వీటితోనే ఉంటే కళ్ల నుండి నీరుకారడం, ఎర్రగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చెప్పలంటే దురదలు అధికంగా ఉంటాయి. అలానే కంటి రెప్పలు రాలిపోయి అవకాశం ఉంది. కనుక కంటి శుభ్రం చేసేటప్పుడు పాలు లేదా కీరదోస ఉపయోగిస్తే ఇలాంటి సమస్యలు రావు.

Related posts

నిద్రపట్టడంలేదా? ఒత్తిడేమో..!

ashok p

బ్యాగ్ పై పడిన మరకలను తోలగించండిలా

Harika

కలలు వేటికి సంకేతాలు?

Harika