Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • బాబు ఐదేళ్ల పాలన అంతా అరాచకమే : జగన్
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

బాబు ఐదేళ్ల పాలన అంతా అరాచకమే : జగన్

కడప జిల్లా రాయచోటిలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్ల పాలన అంతా అన్యాయం, అరాచకమేనని విమర్శించారు. ఐదేళ్లగా ప్రజలను అడుగడుగునా మోసం చేశారన్నారు. చంద్రబాబు గెలవడం కోసం ఎంతటి పనికైనా దిగజారుతారని, దొంగతనాలు చేస్తారని, హత్యలు చేస్తారన్నారు. మా చిన్నాన్న హత్య చేయించింది చంద్రబాబు నాయుడేనన్న జగన్ ఆయనే హత్య చేసి ఆయన పోలీసులనే దర్యాప్తు వేశారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశానని, మరో నెలరోజులు ఓపిక పడితే ప్రజల అన్ని కష్టాలు తీరుతాయని.. ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. బిడ్డను బడికిపంపితే పదిహేను ఇస్తామని, ప్రతి రైతన్నకు ఎకరాకు 12500 స్తామని, వృద్ధులకు మూడువేల పెన్షన్ ఇస్తామని, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ప్రతి అక్క, చెల్లికి కార్యకర్తలు వెళ్లి చెప్పాలన్నారు. ఇది ధర్మానికి-అధర్మానికి జరుగుతున్న యుద్ధంగా భావించాలని పిలుపునిచ్చారు.

Related posts

ఏపీలో ‘యువనేస్తం’ ప్రారంభం!

admin

పూజగదిని వారంలో ఏ రోజు ఏ సమయంలో శుభ్రం చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకోండి

Masteradmin

తెలంగాణా హోంగార్డులకు శుభవార్త!

admin