Mana Aksharam
  • Home
  • Health
  • బాబోయ్… హాట్ చిప్స్ తో ఇంత నష్టమా?
Health Lifestyle

బాబోయ్… హాట్ చిప్స్ తో ఇంత నష్టమా?

why hot chips dangerous for health

హాట్ చిప్స్ కూల్ డ్రింక్ కాంబినేషన్ సూపర్ గ ఉంటుంది కదూ, తినడం తాగడం అందరు ఇష్టంగా చేసే పనులే. అంతవరకు ఒకే, రోజూ అదేపనిగా వాటిని తింటూ కూర్చుంటే.. మంచమెక్కడం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు. ఔను, అదే నిజం! ఇటీవల చిన్నారులకు జరిపిన ‘టేస్ట్’ పరీక్షల్లో.. కొన్ని చేదు నిజాలు బయటపడ్డాయి.
హాస్పిటల్ లో చేరే ప్రతి 100 మంది చిన్నారులకి ఇదే సమస్య ఉంటుందని వైదులు గుర్తించారు. కడుపు నొప్పి, రక్తపు వాంతులు, మూత్రం, మలం నుంచి రక్తం రావడం వంటి సమస్యలతో వస్తున్నారు. అయితే, ఆ ఎర్ర రంగు రక్తం కాదని, ఆయా హాట్ చిప్స్‌లో వేసే ఎర్ర రంగని వైద్యులు పేర్కొన్నారు. ఆ బాధితుల్లోని చాలామంది తల్లిదండ్రులకు.. తమ పిల్లలు ఏం తింటున్నారు కూడా తెలీదన్నారు.

ఇది కేవలం పిల్లలకే పరిమితం కాలేదు. పెద్దలను కూడా ఈ సమస్య వెంటాడుతోంది. అయితే, పిల్లలు బాల్యం నుంచే ఇలాంటి ఆహారాన్ని తిన్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు.ఆసుపత్రికి వచ్చే చిన్నారుల్లో ఎక్కువమంది పొత్తి కడుపులో నొప్పి, గుండెల్లో మంట సమస్యతో బాధ పడుటాన్ని గుర్తించాం. ఈ సమస్యలతో వచ్చే చిన్నారులను మొట్ట మొదట అడిగే ప్రశ్న.. హాట్ చిప్స్ తింటున్నారా? అని. ఎందుకంటే పిల్లలపై హాట్ చిప్స్ ప్రభావం అంతగా ఉందట.

ఎసిడిటీ ముప్పు?: హాట్ చిప్స్ తినేవారు త్వరగా ఎసిడిటీకి గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు. కడుపులో ఉండే పేగులు 5 pH (ఎసిడిటీకి కొలమానం) ఎసిడిటీని మాత్రమే భరిస్తాయి. అయితే, హాట్ చిప్స్, స్నాక్స్‌లలో 3 pH ఎసిడిటీ ఉంటున్నట్లు గుర్తించారు. ఈ స్థాయిల్లో ఎసిడిటీకి గురైనవారికి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తప్పదు. మధుమేహం, గ్యాస్ట్రిటీస్, ఊబకాయం, రక్తపోటు వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇకపై మీకు గానీ, మీ చిన్నారులకు గానీ ఇటువంటి సమస్యలు తలెత్తినట్లయితే.. హాట్ చిప్స్‌, స్నాక్స్‌కు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

Related posts

బేబీ ఆయిల్‌ పని చేస్తుందిలా..

admin

స్నేహమే జీవితం… స్నేహంతోనే ఆరోగ్యం!

admin

స్నేహం చిరకాలం ఉండాలంటే..

admin