Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • బిల్వ దళాలతో శివుని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలం!
Homepage-Slider News Spirituality

బిల్వ దళాలతో శివుని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలం!

మహాశివరాత్రికి లొంగోద్భవకాలమని పేరు. జ్యోతిర్మయరూపంలో ఒక మహాలింగంగా శివుడు ఆ రోజున ఆవిర్భవించాడు. లోకానికి పరమేశ్వరుడు తన దర్శనం చేయించి జగత్తునంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం. అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ప్రధాన ఉద్దేశం మన తనువు, మనసునూ కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. శివరాత్రినాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు ‘బిల్వ’ మూలంలో ఉంటాయనీ, ఆ రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వమైనా శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతారు. 

సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా పూజలందుకుంటాడు. పవిత్రమైన ఆ రోజున ఫలం, తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. వారివారి శక్తి అనుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతితో దీపం వెలిగించి విప్రుడికి దానం ఇస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని అంటారు. శివరాత్రి రోజున ఉపవాసం చేసి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే, సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలితం కలుగుతుందని బ్రహ్మదేవుడికి సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినట్టు తెలుస్తోంది. 

శివాలయంలోకి ప్రవేశించిన తర్వాత నందికి ఏ వైపు నుంచి లోపలకు వెళ్తారో అటు నుంచి మాత్రమే వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలా చేయడం వల్ల పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది. బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. మూడు అకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యన శివుడు. మారేడుకు శివప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ. బిల్వం ఇంటి అవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తూర్పున ఉంటే సౌఖ్యం. పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షిణాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం. 

Related posts

డ్రగ్స్ కేసు : అకున్ సబర్వాల్ సెలవు రద్దు!

ashok p

వైసీపీకి మరో షాక్

Manaaksharam

టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలి!

ashok p