Mana Aksharam
  • Home
  • News
  • బీజేపీ నేత కిషన్‌రెడ్డికి బెదిరింపు కాల్స్.. చంపేస్తామని హెచ్చరిక
News

బీజేపీ నేత కిషన్‌రెడ్డికి బెదిరింపు కాల్స్.. చంపేస్తామని హెచ్చరిక

బీజేపీ సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి.. కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌ను కలిశారు. ఢిల్లీలో మంగళవారం ఆయనను కలిసి కిషన్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. ఎవరో గుర్తు తెలియనివాళ్లు కాల్ చేసి బెదిరిస్తున్నారని, చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని చెప్పారు. వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. జనవరి 21న లండన్‌లో సయ్యద్ సుజా అనే వ్యక్తితో కలిసి ప్రెస్‌మీట్ పెట్టిన కపిల్ సిబల్ ‘‘2014 ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డి 11 మందిని హత్య చేయించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు తోడ్పడ్డారు’’ అంటూ ఆరోపించారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని కోరానన్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన కపిల్ సిబల్‌పై పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. ఈ వ్యవహారంలోనే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. అయితే, తానెవరికీ భయపడబోనన్నారు.

ఇక, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేయడం ఖాయమని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. అయితే, ఎక్కడ్నుంచి పోటీ చేస్తాననే అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. 16 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామంటున్న టీఆర్ఎస్ నేతల కామెంట్లపై ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీకి 15 మంది ఎంపీలు ఉన్నారని, రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటేసి, మోదీని మరోసారి ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్ పార్టీ.. దేశాన్ని ఏం పాలిస్తుందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడిగే అర్హతే లేదన్నారు.

Related posts

చినబాబు చెప్పిన వేదాంతం!

ashok p

సింగరేణిపై గులాబీ జెండా ఎగురవేస్తాం..

ashok p

జగన్ గూటికే వలస పక్షులు!

ashok p