Mana Aksharam
  • Home
  • Health
  • బీన్స్ తో మధుమేహంకి గుడ్బై
Health

బీన్స్ తో మధుమేహంకి గుడ్బై

beans avoids diabetes

మన అందరికి లభించే అధిక పోషకాలు ఉన్న ఆహారాల్లో బీన్స్ కూడా ఒకటి. కానీ వీటిని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. అయితే నిజానికి వీటిని తినడం వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే వీటిని ఇకపై అస్సలు వదిలిపెట్టరు . ఎందుకంటే బీన్స్ తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి . అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బీన్స్‌ను తరచూ తినడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు తమ ఆహారంలో బీన్స్‌ను చేర్చుకుంటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. 2. బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వాటిని తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి . ముఖ్యంగా మలబద్దకం, అజీర్తి వంటివి పోతాయి . 3. చికెన్‌, మటన్‌, కోడిగుడ్లు తినలేమని అనుకునే వారు బీన్స్‌ను తినడం మంచిది. ఎందుకంటే నాన్‌వెజ్ ఆహారాలకు సమానంగా ప్రోటీన్లు బీన్స్‌లో ఉంటాయి. అందువల్ల వాటిని తినని వారు బీన్స్‌ను తింటే శరీరానికి ప్రోటీన్లు లభిస్తాయి . తద్వారా ప్రోటీన్ల లోపం లేకుండా చూసుకోవచ్చు. 4. అధిక బరువు ఉన్నవారు ఎక్కువగా బీన్స్‌ను తింటుంటే శరీరంలో ఉండే కొవ్వు ఇట్టే తగ్గిపోతుంది .అధిక బరువు తగ్గుతారు. 5. బీన్స్‌లో ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వెంట్రుకలు, చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది.

Related posts

స్పూన్ తో మీ ఆరోగ్యాన్ని టెస్ట్‌‌ చేసుకోండి!

admin

మెదడు ఆరోగ్యానికి బీట్రూట్..

admin

జీవక్రియల జోరుకు నిద్ర

admin