Mana Aksharam
  • Home
  • Breaking
  • భర్తఅందంగా లేడని, భార్య పెట్రోల్‌ పోసి తగులబెట్టింది.
Breaking National News

భర్తఅందంగా లేడని, భార్య పెట్రోల్‌ పోసి తగులబెట్టింది.

ఉత్తరప్రదేశ్‌, బరేలిలో దారుణం చోటుచేసుకుంది. భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య పెట్రోల్‌పోసి కాల్చివేసింది ఈ అమానుష ఘటన గత సోమవారం జరిగింది . బరేలిలో నివసిస్తున్న ప్రేమ్‌శ్రీ, సత్యవీర్‌సింగ్‌కు రెండేళ్ల కిత్రము పెళ్లైంది. వీరిద్దరికి సంతానంగా 5 నెలల పాప ఉంది. అందంగా ఉండే ప్రేమ్‌ శ్రీ తన భర్త సత్యవీర్‌ సింగ్‌ నల్లగా ఉన్నాడని బాధపడేది. ఎప్పుడు అతని శరీర రంగును ప్రస్తావిస్తూ గొడవపడేది. ఇదంతా మాములేనని కుటుంబసభ్యులు భావించగా.. ప్రేమ్‌శ్రీ వారు ఊహించని ఘాతుకానికి పాల్పడింది. తన భర్త అంధ విహీనంగ ఉండటం తట్టుకోలేక.. నిద్రిస్తున్న సమయంలో అతనిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టింది. దీంతో తీవ్రగాయాలైన సత్యవీర్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి సోదరుడు హర్వీర్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

చినబాబు మళ్ళీ నోరుజారాడు!

admin

ఎక్కడి నుంచి ఇవ్వాలి?

Masteradmin

‘డ్రగ్స్‌ కేసు’లో అజాజ్‌ ఖాన్ అరెస్ట్‌!

Masteradmin