Mana Aksharam
  • Home
  • Entertainment
  • భారీ రెమ్యూనరేషన్ అందుకున్న అలియా భట్..
Entertainment Gossips

భారీ రెమ్యూనరేషన్ అందుకున్న అలియా భట్..

alia bhatt remuneration for RRR

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టులోకి అలియా భట్‌ను తీసుకుంటున్నట్లు గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అఫీషియల్‌గా ప్రకటించారు దర్శకుడు రాజమౌళి . అయితే ప్రెస్ మీట్ జరుగడానికి కొన్ని రోజుల ముందే అలియా భట్ విషయం మీడియాకు లీకైంది.
దాదాపు రెండు నెలల ముందు నుంచే అలియా భట్‌తో చిత్ర బృందం చర్చలు జరుపుతోందట. రాజమౌళి కథ చెప్పగానే నచ్చిందని, తప్పకుండా చేస్తానని చెప్పిన అలియా భట్… రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదని సమాచారం. ఈ క్రమంలో ఆమెతో పలు దఫాలు చర్చలు జరిపారట. ఆమె సైన్ చేసిన తర్వాతే అఫీషియల్‌గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విషయం వెల్లడించారు.

అలియా భట్ బాలీవుడ్లో వరుస విజయాలు అందుకోవడంతో పాటు తన అద్భుతమైన యాక్టింగ్ టాలెంటుతో మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్‌గా మారింది. పలు బాలీవుడ్ భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ‘రాజీ’ సినిమా విజయం తర్వాత ఆమె రెమ్యూనరేషన్ మరింత పెరిగిందట. ఈ చిత్రానికి రూ. 7.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
RRR చిత్రానికి అలియా భట్ తాను బాలీవుడ్లో ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే చార్జ్ చేసిందట. అలియా భట్ తమ సినిమాకు అవసరం, బాలీవుడ్ మార్కెట్ పరంగా కలిసొస్తుంది కాబట్టి ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాత దానయ్య అంగీకరించినట్లు సమాచారం. రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు చార్జ్ చేస్తుందని టాక్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడ్తుంది.

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చిన్న స్కేల్‌లో తీయడం లేదని, భారీ మొత్తం ఖర్చు పెడుతున్నట్లు రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. మీడియా అడిగిన ప్రశ్నకు నిర్మాత దానయ్య స్పందిస్తూ ఆన్ బోర్డ్ బడ్జెట్ రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. జులై 30, 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts

నా మీద కోపమా.. ప్రూఫ్ ఏది?

Harika

‘డీజే’ ట్రైలర్ న్యూ రికార్డ్స్!

ashok p

పట్టు చీరపై పవన్‌ కల్యాణ్‌.. అభిమానం చాటుకున్న ఆనంద్!

ashok p