భార్యను చంపి మృతదేహాన్ని బెడ్ కింద పెట్టిన భర్త

ఛండీగఢ్: ఓ భర్త తన భార్యను గొంతు నులిమి చంపి అనంతరం మృతదేహాన్ని బెడ్ కింద పెట్టిన సంఘటన హర్యానాలోని బహదుర్గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతదేహం ఉన్న ఇంట్లో నుంచి వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రజ్వీర్ అనే వ్యక్తి లలిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. భర్తతో విభేదాలు రావడంతో ఆమె తన కూతురు, కుమార్తెతో కలిసి విడిగా ఐదు సంవత్సరాల నుంచి ఉంటుంది. లలిత కుమారుడు నిశాంత్ జన్మదినం వేడుకలు నవంబర్ 22న తన భర్త అక్క వాళ్ల ఇంట్లో చేసింది. ఇదే అదునుగా భావించిన రజ్వీర్ భార్యను చంపేయాలని ప్లాన్ చేశాడు. పుట్టిన రోజులు వేడుకలు ముగిసిన వెంటనే పిల్లలిద్దరిని బంధువుల ఇంటికి పంపించాడు. అనంతరం లలితను గొంతు నులిమి చంపి మృతదేహాన్ని బెండ్ కింద దాచేశాడు. ఆ ఇంటి నుంచి వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇంట్లో తనిఖీలు చేయగా బెడ్ కింద మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. శవ పరీక్షలో గొంతు నులిమి చంపినట్టు తేలింది. లలిత తమ్ముడు అక్షయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*