wife murdered husband
wife murdered husband

మటన్ సాకుతో భర్త మర్డర్ కి స్కెచ్ వేసింది

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. మహబూబాబాద్‌లో సెప్టెంబర్ 12న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు.మహబూబాబాద్ జిల్లాలో గత నెల 12వ తేదీన జరిగిన పెయింటర్ ఇన్నారపు నవీన్ హత్యకేసును పోలీసులు చేధించారు. నవీన్ భార్య పక్కింటి యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని, ప్రియుడి సాయంతోనే భర్తను హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు వారిద్దరితో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
మహబూబాబాద్‌ పట్టణంలోని మంగలికాలనీకి చెందిన ఇన్నారపు నవీన్‌ పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నవీన్ పని నిమిత్తం ఎక్కువ సమయం ఇంట్లో ఉండకపోవడంతో అతడి భార్య శాంతి.. వెంకటేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రెండేళ్లుగా గుట్టుగా సాగుతున్న వీరి బంధం గురించి నవీన్‌ను ఇటీవలే తెలియడంతో భార్యను హెచ్చరించాడు. దీనిపై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న నవీన్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని వారిద్దరు నిర్ణయించుకున్నారు.పథకం ప్రకారం శాంతి సెప్టెంబర్ 12న భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. మటన్ తీసుకురావాలని నవీన్‌కు చెప్పడంతో స్కూటీపై రేగడితండాకు బయలుదేరాడు. మార్గమధ్యలో వెంకటేశ్, అతడి స్నేహితుడు కాపుకాసి నవీన్‌ను అడ్డగించారు. అతడి తలపై ఇనుప రాడ్‌తో బలంగా మోది చంపేశాడు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కూటీని నవీన్‌పై పడేసి వెళ్లిపోయారు. భర్త చనిపోయిన విషయం తెలియగానే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు శాంతి శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. అయితే శాంతి అక్రమ సంబంధం గురించి తెలిసిన నవీన్ సోదరుడు ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం, కురవి ఎస్ఐ శంకర్రావు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేశారు. సంఘటనా స్థలం వద్ద లభించిన ఆధారాలతో పాటు అక్కడ దొరికిన మద్యం సీసాలపై బార్‌కోడ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. శాంతి, వెంకటేశ్ కాల్స్‌డేటాను పరిశీలించి వారు మాట్లాడుకున్న సంభాషణలను విశ్లేషించారు. దీంతో వారిద్దరే నవీన్‌ను హత్య చేశారని నిర్ధారించి మంగళవారం అరెస్ట్ చేశారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*