Mana Aksharam
  • Home
  • Breaking
  • మల్కాజ్ గిరి బరిలోకి రేవంత్
Andhra Breaking Editorial Headlines Homepage-Slider National News Politics Telangana

మల్కాజ్ గిరి బరిలోకి రేవంత్

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన సీట్లు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, కనీసం గెలిచిన అభ్యర్థులను సైతం నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితి.మొన్న ఆత్రం సక్కు, రేగాకాంతారావు, హరిప్రియానాయక్ లు , తాజాగా సబితారెడ్డి లను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైయ్యింది. ఒక దశలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సబితమ్మను పార్టీ మారకుండా ఆప్ ప్రయత్నం చేసినా కాంగ్రెస్ హైకమాండ్ సబితా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి కి చేవెళ్ల పార్లమెంట్ స్థానం పై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేసీఆర్ సమక్షంలో సబితమ్మ కారెక్కేసింది. దీంతో ముఖ్యనాయకులు మరియు గెలిచిన అభ్యర్థులు పార్టీ మారుతున్న పరిస్థితులను చూసి టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీలో అత్యంత ముఖ్యనాయకుడిగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి పరిస్థితుల రీత్యా కాంగ్రెస్ పార్టీలో చేరారు.125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ, ఎవ్వరికీ దక్కనివిధంగా రేవంత్ కు అత్యంత ప్రాధాన్యం దక్కింది. రేవంత్ వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, యువకులను ఆకర్షించే నేర్పరితనం తెలంగాణా యాసలో రేవంత్ పేల్చే ఛలోక్తులకు పెద్దలు సైతం రెప్పవేయకుండా తన ప్రసంగాల్ని వీక్షించే తత్వాన్ని చూసిన రాహుల్ గాంధీ అనతి కాలంలోనే రేవంత్ ను వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమించారు. అయితే రాహుల్ తనపైన పెట్టుకున్న నమ్మకానికి ఎలాగైనా న్యాయం చేయాలని రేవంత్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెట్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజక వర్గాలు మినహా, మిగిలిన నియోజక వర్గాల్లో అభ్యర్థులుగా ఎవరిని ఖరారు చెయ్యాలో తెలియని పరిస్థితి. అయితే ఖచ్చితంగా గౌరవప్రదమైన సీట్లు గెలిపించాలని రేవంత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

అందుకే రేవంత్ కూడా పార్లమెంట్ బరిలోకి దిగాలనే గట్టి నిర్ణయానికి వచ్చారు. మల్కాజ్ గిరి స్థానం నుండి పోటీచేయాలని భావిస్తున్నారు. మల్కాజ్ గిరిలో పోటీచేస్తే మాత్రం గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని సామాన్యులు సైతం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు, బాబు జోక్యం, మరోసారి తెలంగాణా సెంటిమెంట్ ప్రయోగం జగన్ ,పవన్ ల పరోక్ష మద్దత్తు కలసి భారీ విజయాన్ని టీఆరఎస్ సొంతం చేసుకున్నప్పటికీ, పార్లమెంట్ ఫలితాలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయని ఓటర్లే విశ్లేషకుల మాదిరి చెబుతున్న పరిస్థితి. బంగారు తెలంగాణా గా నిర్మాణం కోసం కేసీఆర్ కష్టపడుతున్నారు. మరి తెలంగాణా సమస్యల గళాన్ని పార్లమెట్ సాక్షిగా వినిపించాలన్నా , కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను తెలంగాణాకు చేస్తున్న అన్యాయాలను నిలదీయాలన్న రేవంత్ రెడ్డి లాంటి ఘటికుడును పార్లమెంటుకు పంపించాల్సిందే అని అంటున్నారు ప్రజలు.

విషయంపై పూర్తి అవగాహన, అందరికి అర్ధమయ్యే రీతిలో విషయ ప్రాధాన్యతను వివరించే తీరు, ఆచితూచి మాట్లాడటం, మాట్లాడే ముందు ఒకటికి వంద సార్లు సరిచూసుకుని మాట్లాడటం, ఎవ్వరినైనా కలుపుకుని వెళ్లే మనస్తత్వం రేవంత్ రెడ్డి కి పూర్తిగా అనుకూలించే అంశాలు. ఢిల్లీ స్థాయిలో మాత్రం తెలంగాణా తరుపున కొట్లాడాలంటే మాత్రం రేవంత్ రెడ్డిని పార్లమెంటు కు పంపితీరాల్సిందే అని ప్రతిఒక్కరూ అంటున్న పరిస్థితి. మన రాష్ట్రంలో మనం రాజకీయంగా పోటీపడేటప్పుడు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచాం. కానీ పార్లమెంట్ స్థాయిలో మన తెలంగాణా తరుపున మాట్లాడాలంటే ఏపార్టీ అయితే మనకేంటి పులి లాంటోడిని పార్లమెంటుకు పంపాల్సిందే , మన తెలంగాణా సత్తా ఏంటో చూపించాల్సిందే అని ప్రజలే చర్చించుకుంటున్నారు.

ఒక వేళా కాంగ్రెస్ అధినాయకత్వం మల్కాజ్ గిరి అయినా లేక మరే స్థానం నుండి పోటీచేసినా రేవంత్ రెడ్డి ని ప్రజలు గెలిపించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఇదే గనక జరిగితే ఇప్పటివరకు అసెంబ్లీ లో తన జన గళాన్ని వినిపించిన రేవంత్ రెడ్డి , ఇక పార్ల మెంట్ ను తన ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని అనుకుంటున్నారు తెలంగాణా ప్రజలు. రేవంత్ రాష్ట్రంలో ఉండటం కంటే ఢిల్లీకి పంపిస్తేనే కేసీఆర్ పూర్తిగా మనశాంతితో ఉంటాడని ప్రజలు జోకులు పీల్చుకుంటున్నారు. మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో కాస్త వేచి చూద్దాం.

Related posts

ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఆరంగేట్రం!

Manaaksharam

నల్లగొండలో మరో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య

ashok p

కాంగ్రెస్ లోకి సమర సింహా!

ashok p