maharastra cm resign
maharastra cm resign

మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి భగత్ సింగ్ కోషియారీని కలసి తన రాజీనామాను సమర్పించారు. మహారాష్ట్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఎన్నికల ముందు బీజేపీ – శివసేన పొత్తు పెట్టుకుని కలసి పోటీ చేశాయి. బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చాయి. రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ రెండున్నరేళ్లు తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని శివసేన పట్టుబట్టడంతో మహారాష్ట్ర పంచాయతీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు శివసేన మెట్టుదిగలేదు. ఈ రోజుతో మహారాష్ట్రలో అసెంబ్లీ పదవీకాలం ముగిసింది. దీంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్‌ను కలసి తన రాజీనామాను సమర్పించారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*