మిథాలీరాజ్ బయోపిక్ లో మెరవనున్న తాప్సి

మిథాలీ రాజ్..మగవారే క్రికెట్ ఆడాలి అన్న మాటను తుడిచేస్తూ మేము అడగలం అంటూ దూసుకొచ్చింది మిథాలీ.భారతదేశ మహిళా జట్టు కెప్టెన్ గా ఎన్నో ట్రోఫీలను గెలిచింది మిథాలీ.భారత దేశాన్ని గర్వపడేలా చేసిన ఈ మహిళా క్రికెటర్ పుట్టిన రోజు నేడు.అయితే ఈమె పుట్టినరోజు సందర్బంగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.అదేంటంటే మిథాలీ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెస్తున్నారట .ఇందులో మిథాలీ పాత్రను తాప్సి పోషిస్తుందట.ఈ విషయాన్నీ స్వయంగా తాప్సి ట్విటర్ వేదికగా తెలిపారు.. ‘హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ మిథాలీ రాజ్. ఎన్నో విధాలుగా మమ్మల్ని గర్వపడేలా చేశావ్. నీ జీవిత ప్రయాణాన్ని తెరపై చూపించే అవకాశం నాకు వచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నాను. నీ పుట్టినరోజు సందర్భంగా ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు తెలీడంలేదు కానీ ఒక మాట ఇవ్వాలనుకుంటున్నాను. ఈ బయోపిక్‌లో నా రూపంలో నిన్ను నువ్వు చూసుకుని తప్పకుండా గర్వపడతావని మాత్రం చెప్పగలను. ఇక నేను కవర్ డ్రైవర్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*