Mana Aksharam
  • Home
  • News
  • మీ పాస్ వర్డ్ ఇలా పెట్టుకుంటే తస్మాత్ జాగ్రత్త
News Technology

మీ పాస్ వర్డ్ ఇలా పెట్టుకుంటే తస్మాత్ జాగ్రత్త

mobile password

ప్రపంచ జనాభాతో పటు సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతలా అంటే స్మార్ట్ ఫోన్ ఫోన్ అన్ని కంట్రోల్ చేసే యుగంలో కి మనం వచ్చం. ఎక్కడికి వెళ్లకుండా మీ మొబైల్ తోనే అన్ని పనులు సక్రమంగా నిర్వర్తించే ల మన టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకున్నాము. ఇప్పుడు మీ మొబైలే మీ బ్యాంక్, మీ ఏటీఎం, మీ సేవకుడు. ఎలాంటి సేవలు పొందాలన్నా కూర్చున్న చోటు నుంచి మొబైల్ లో ఓ ఆర్డర్ వేస్తే చాలు.. చిటికెలో వచ్చి వాలతాయి. కానీ ఇలాంటి సేవలన్నింటికీ అవసరమయ్యేది పాస్ వర్డ్..ఈ మెయిల్ ఓపెన్ చేయాలన్నా.. నెట్ బ్యాంక్ ఖాతా యాక్సిస్ చేయాలన్నా.. ఫేస్‌ బుక్, ట్విట్టర్ వంటివి ఓపెన్ చేయాలన్నా.. చివరకు సొంత కంప్యూటర్ ఓపెన్ చేయాలన్నా పాస్ వర్డ్ వాడాల్సిన పరిస్థితి. మరి ఎన్నిపాస్‌ వర్డ్‌లను తయారు చేస్తాం.. ఎన్నని గుర్తుపెట్టుకుంటాం.. ఇదిగో ఇక్కడే చాలామంది సులభంగా బుట్టలో పడిపోతుంటారు.పాస్ వర్డ్ ఎంచుకోవడంలో బోల్తా పడతారు. అందరికీ సులభంగా గుర్తుండే పాస్‌వర్డ్‌లు ఉపయోగిస్తుంటారు. అలాంటి వాటిలో కొన్ని 123456, 111111, 222222, 98765432.. ఇలాంటివన్నమాట. ఇలాంటి సులభమైన పాస్‌ వర్డ్ ల కారణంగా మీ బ్యాంక్ ఖాతాల వంటి కీలకమైన వాటిని హ్యాకర్లు, నెట్ మోసగాళ్లు సులభంగా ఓపెన్ చేస్తారు. మరికొందరు QWEERT, ASDFG, ZXCVB వంటి కీబోర్డుల్లోని వరుస పదాలు పాస్‌వర్డ్‌ గా వాడతారు. ఇది కూడా మంచిది కాదు.చాలామంది తమ పేరును పాస్‌వర్డ్ గా పెట్టుకుంటారు. మరికొందరు తమ పేరుతో పాటు పుట్టిన సంవత్సరాన్ని యాడ్ చేసి పెట్టుకుంటారు. ఇలాంటివి కూడా సులభంగా దొరికిపోతాయి. మరికొందరు వివిధ సేవల కోసం ఒకే పాస్‌ వర్డ్‌ ను వాడుతుంటారు. ఇది కూడా చాలా డేంజర్. ఏళ్ల తరబడి ఒకే పాస్ వర్డ్ వాడటమూ మంచిది కాదు. పాస్‌వర్డ్‌లపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగు చూశాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త.

Related posts

రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ వినాయకుడు!

ashok p

హారిక కేసులో కొత్త ట్విస్ట్

ashok p

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఒవైసీ రాయభారమా?

ashok p