Mana Aksharam
  • Home
  • News
  • మూడో విజయం, సిరీస్ టీమిండియాదే!
Breaking Headlines Homepage-Slider National News Sports

మూడో విజయం, సిరీస్ టీమిండియాదే!

కోహ్లీసేన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాలో మొద‌లైన టీమిండియా జైత్ర‌యాత్ర న్యూజిలాండ్‌లోనూ కొన‌సాగుతోంది. ఆసీస్‌లో వ‌న్డే సిరీస్ గెలుపొందిన భార‌త్ తాజాగా కివీస్‌పై కూడా ఆ ఘ‌న‌త‌ను రిపీట్ చేసింది. వ‌రుస‌గా మూడు వ‌న్డేల్లోనూ విజ‌య కేత‌నం ఎగుర‌వేసి మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే సిరీస్ విజేత‌గా నిలిచింది. ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగునుయ్‌లో ఈ రోజు (సోమ‌వారం) ప్రారంభ‌మైన మూడో వ‌న్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టాస్ గెలిచిన ఆనందం కివీస్‌కు ఎంతో సేపు నిల‌వ‌లేదు. భార‌త బౌల‌ర్ల ధాటికి అరంభంలోనే మూడు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో టేల‌ర్ (93), లాథ‌మ్ (51) అర్ధ‌శ‌త‌కాలు సాధించ‌డంతో న్యూజిలాండ్ కోలుకుంది. అయితే వీరు అవుటైన త‌ర్వాత ప‌రిస్థితి మారిపోయింది. ఈ ఇద్ద‌రూ మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మ‌న్ విఫ‌ల‌మ‌వడంతో న్యూజిలాండ్ 49 ఓవ‌ర్ల‌లో 243 ప‌రుగులకు ఆలౌట్ అయింది. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మిగిలిన వారిలో భువి, చాహ‌ల్‌, పాండ్యా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.

అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ సునాయాసంగా ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఈ విజ‌యంతో భార‌త్ సిరీస్‌లో 3-0 ఆధిక్యం సంపాదించింది. మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను త‌న ఖాతాలో వేసుకుంది.. ఐదు వన్డేల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి 3-0 ఆధిక్యంలో నిలిచింది. వరుసగా రెండో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కివీస్‌ నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ (60), రోహిత్‌ శర్మ (62), అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌ రాణించారు.

Related posts

ఇప్పుడైనా వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి!

ashok p

గత మూడేళ్లుగా ఎపి మంత్రులు ఇదే మాట!

Manaaksharam

నంద్యాల బరిలో దిగుతాం : వైసీపీ

ashok p