Mana Aksharam
  • Home
  • News
  • యాపిల్‌ వైర్‌లెస్ చార్జింగ్ ప్రాజెక్టును రద్దు చేసిందా?
News Technology

యాపిల్‌ వైర్‌లెస్ చార్జింగ్ ప్రాజెక్టును రద్దు చేసిందా?

apple stopped its wireless charging project

అమెరికా టెక్ దిగ్గజం ‘యాపిల్’ ప్రయాణంలో ఇదో అసాధారణ పరిణామం. తాను అభివృద్ధి చేస్తున్న ఒక ప్రొడక్ట్ తాను పెట్టుకున్న ప్రమాణాలకు తగినట్లుగా రాకపోవడంతో ఆ ప్రాజెక్టును రద్దు చేసింది.

ఐఫోన్, స్మార్ట్ వాచ్, ఎయిర్‌పాండ్ లాంటి డివైస్‌లను ఒకేసారి వైర్‌లైస్ ఛార్జింగ్ చేయడానికి వీలు కల్పించే సాధనాన్ని తీసుకొస్తామని 2017 సెప్టెంబరులో యాపిల్ ప్రకటించింది.

ఈ సాధనం పేరు ఎయిర్‌పవర్. ఛార్జింగ్ సమయంలో ఎయిర్‌పవర్ విపరీతంగా వేడెక్కుతోందని, దీనిని యాపిల్ ఇంజినీర్లు నియంత్రించలేకపోయారని, ప్రాజెక్టును ఆపేయడానికి ఇదే కారణమనే సమాచారం ఉంది.

”ఎయిర్‌పవర్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాం. అయితే మేం నిర్దేశించుకున్న ఉన్నతస్థాయి ప్రమాణాలను ఇది అందుకోలేదని మేం గుర్తించాం. అందుకే ప్రాజెక్టును రద్దు చేశాం” అని యాపిల్ ప్రకటించింది. వివరాలను వెల్లడించలేదు.

ఎయిర్‌పవర్ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి దీనిపై వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి.

ఇదో ప్రపంచస్థాయి వైర్‌లెస్ ఛార్జింగ్ పరికరమని, 2018లో దీనిని విడుదల చేస్తామని యాపిల్ లోగడ తెలిపింది.

ఎయిర్‌పవర్ వేడిని నియంత్రించడంలో సమస్యలు ఉన్నట్లు ఇంజినీర్లు గుర్తించారనే అర్థంలో యాపిల్ ఉత్పత్తులను విశ్లేషించే జాన్ గ్రుబర్ చెప్పారు.

Related posts

కేసీఆర్‌ కుటుంబానికి హత్యాపాపం: వీహెచ్‌

admin

శ్రీ రెడ్డి అర్ధనగ్న నిరసన

admin

రేవంత్ కాంగ్రెస్ లోకి రావాలని నేనే కోరా: వీహెచ్

Masteradmin