Mana Aksharam
  • Home
  • Sphoorthi
  • యూట్యూబ్ చూసి నేర్చుకొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది
Sphoorthi

యూట్యూబ్ చూసి నేర్చుకొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది

rugby player inspirational story

బిహార్‌లోని నలందా జిల్లాలోని మారుమూల గ్రామం బదరి నుంచి వచ్చిన శ్వేత ప్రపంచ స్థాయి టోర్నీల్లో ప్రాతినిథ్యం వహించే స్థాయికి చేరుకుంది. భారత్‌లో అభివృద్ధి చెందిన నగరాల్లోనే రగ్బీకి పెద్దగా ఆదరణ లేదు. అలాంటిది ఎక్కడో బిహార్‌లోని కుగ్రామానికి చెందిన అమ్మాయి ఆ క్రీడ గురించి తెలుసుకొని.. దాంట్లో రాణిస్తుందని ఎవరైనా అనుకుంటారా? కానీ శ్వేత ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. భారత జట్టు తరపున అంతర్జాతీయ టోర్నీల్లో పోటీ పడి పతకాలు కూడా గెలుచుకుంది.

ఆటలోకి అలా..: చిన్నవయసులోనే నాన్న ఫోన్‌లో యూట్యూబ్‌లో తొలిసారి రగ్బీ ఆటను చూసిన శ్వేత దానిపై ఆసక్తి పెంచుకుంది. అప్పటి నుంచి గంటల పాటు ఆ ఆటకు సంబంధించిన వీడియోలు చూస్తూనే గడిపేది. దాంట్లో ఏ విధంగా ఆడుతున్నారో చూసి  అనుకరించడం మొదలెట్టింది. అనుకోకుండా ఓసారి రాష్ట్ర అథ్లెటిక్స్‌ మీట్‌లో శ్వేత.. రగ్బీ బంతితో సాధన చేస్తుండటం చూసిన ఆ రాష్ట్ర రగ్బీ సంఘం కార్యదర్శి.. ఆ అమ్మాయిని రగ్బీనే కెరీర్‌గా ఎంచుకోమని ప్రోత్సహించాడు. ఆ ఆట గురించి వివరాలు శ్వేతకు తొలిసారి తెలిసింది అప్పుడేనట. ఇక అప్పటి నుంచి ఆమె లోకం రగ్బీనే. ఆ క్రీడలో అత్యుత్తమ శిఖరాలకు చేరాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకుంది. కానీ వాళ్లదేమో చిన్న గ్రామం. ఆ ఊర్లో రగ్బీ గురించి ఎవరికీ తెలీదు. ఆడేందుకు వసతులు కూడా లేవు. అలాంటి సమయంలో కూతురు ఆసక్తిని గమనించిన వాళ్ల నాన్న శ్వేతకు అండగా నిలబడ్డాడు. ఊరి బయట మైదానంలో సాధన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే అది నచ్చని ఆ స్థలం యజమాని మైదానం చుట్టూ కంచె వేయించాడు. దాంతో శ్వేత రోజూ పొద్దున లేచి.. సైకిల్‌పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాల మైదానానికి వెళ్లి సాధన చేసేది. కోచ్‌ను నియమించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో వాళ్ల నాన్నే స్వయంగా శిక్షణ ఇవ్వడం మొదలెట్టాడు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో రగ్బీకి సంబంధించిన వీడియోలు చూసి మెలకువలు, శిక్షణ పొందే పద్ధతులు తెలుసుకొని మైదానంలో వాటిని అనుకరించేది శ్వేత. అలా భారత జట్టు వరకు చేరిన ఆమె.. ఇప్పుడు జట్టులో స్టార్‌ ప్లేయర్‌. శ్రీలంక, దక్షిణకొరియా, దుబాయిల్లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా రగ్బీ సెవెన్‌ సిరీస్‌లో పాల్గొని మెరిసింది.

Related posts

అతివల ఐక్యతా, ఆలోచనా తీరు, పాటించే నియమాలే వారి బలం..

admin

పరిష్కారానికి పురస్కారం సాధించిన నీరజ..

admin

హ్యాట్సాఫ్ రిక్షావాలా తనయ..

Masteradmin