Mana Aksharam
  • Home
  • Manavi
  • రక్తం గడ్డ కట్టడం వల్ల ఇన్ని సమస్యలా?
Health Manavi

రక్తం గడ్డ కట్టడం వల్ల ఇన్ని సమస్యలా?

blood clots leads to several diseases

రక్తం గడ్డకట్టడం అనేది చాలా అంశాలమీద ఆధారపడి ఉంటుంది. దాని వలన శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం నిలిచిపోతుంది. దీంతో గుండెనొప్పి, హార్ట్ స్ట్రోక్స్ వంటి పరిస్థితులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. రక్తం గడ్డకట్టడంలో 2 రకాలు ఉంటాయి. ధమనులు, సిరలకు సంబంధించినవి. రక్తం గడ్డకట్టడం వలన శరీరంలోని పలు అవయవాలకు రక్తం, ప్రాణవాయువును సరిగా అందదు. దాంతో అనేక సమస్యలు వస్తూ… కణజాల నష్టానికి కూడా దారితీస్తుంది. ధమనులలో రక్తం గడ్డకడితే గుండెకు, మెదడుకు రక్తం, ప్రాణవాయువు అందకపోవడంతో గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. ఇక సిరల అంశానికి వస్తే, ఎక్కువగా రక్తం గడ్డకట్టుటకు సంబంధించిన సమస్యలు కాళ్ళ భాగంలో కనిపిస్తుంటాయి. దీన్ని డీప్ వీన్ త్రొంబోసిస్ గా వ్యవహరిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న పదిమందిలో ధమనులలో రక్తం గడ్డకట్టడం వలన మరణిస్తున్న వారు ఒక్కరు ఉంటున్నారు. సిరలలో రక్తం గడ్డకట్టడం చేత గుండె పోటు వంటి సమస్యలే కాకుండా, వైకల్యం, మానసిక ప్రభావాలు వంటి అనేక సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది. ఒక్కోసారి ఇవి తీవ్రంగా మారి ప్రాణాల మీదికి తీసుకొస్తాయి. ఊపిరితిత్తులలో, సిరలో రక్తం గడ్డకట్టినప్పుడు తొలుత ఎలాంటి లక్షణాలు బయటపడవు. ఈ డి.వి.టీ యొక్క లక్షణాలు ఒక కాలిలోగానీ చేతిలో గానీ ఏకపక్షంగా వాపుని కలుగజేస్తాయి. కాళ్ళ నొప్పి, చర్మం ఎరుపు రంగులోకి మారడం, చేతులు, కాళ్లలో సిరలు విస్తరించి, సున్నితంగా మారిన ప్రాంతంలో “పచ్చిగా” లేదా వేడి కలిగే లక్షణాల ద్వారా ఈ సమస్యలను గుర్తించవచ్చు. ఉదర క్యాన్సర్ శస్త్రచికిత్సలు రక్తం గడ్డకట్టడానికి ముఖ్య కారణం అవుతాయి. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటే, దీని వలన దీర్ఘకాలికంగా నడవలేకపోవడం, పాక్షిక పక్షవాతం, అవయవాల పనితీరు మందగించడం జరుగుతుంది. అందుకని ఏ చిన్న అసౌకర్యం తలెత్తినా వైద్యున్ని సంప్రదించాలని ఆరోగ్యనిపునులు సూచిస్తున్నారు. రక్తం గడ్డకట్టే ప్రమాద కారకాల గురించి సరైన అవగాహన లేకపోవడం కారణంగా ఈ పరిస్థితి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. 85 శాతం హార్ట్ స్ట్రోక్స్ రక్తం గడ్డకట్టడం వలెనే కలుగుతాయని ఒక అద్యయనంలో వెల్లడైంది. చురుకుగా ఉంటె రక్తం గడ్డకట్టడాన్ని నివారించవచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు. శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు గురైనప్పుడు వీలైనంత త్వరగా వైద్యుని సంప్రదించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

పచ్చి టమాటా తినడం వల్ల ఆరోగ్యానికి ఇన్ని లాభాలా?

Harika

నుదురు చిన్నగా కనిపించాలంటే…

ashok p

గర్భిణీ స్త్రీలు టూత్పేస్ట్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

Harika