Mana Aksharam
  • Home
  • Health
  • లేత కొబ్బరితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
Health

లేత కొబ్బరితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

health benefits of green coconut

ఎండాకాలం రాగానే కొబ్బరి నీళ్లు తాగుతాం.. ఆ బొండాల్లోని లేత కొబ్బరిని వదిలేస్తాం. ఫలితంగా మనం ఎంతో విలువైన పోషకాల్ని కోల్పోతున్నట్లే. ఈ ప్రకృతిలో మన అదృష్టం కొద్దీ వరంలా వచ్చిన వాటిలో కొబ్బరిబొండాం ఒకటి. కొబ్బరి నీళ్ల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను మించిన ఎనర్జీ డ్రింక్‌ మరొకటి లేలు. కానీ కొబ్బరి బొండాంలోని లేత కొబ్బరిని చాలా మంది వదిలేస్తారు. అందులో ఉండే లేత కొబ్బరిని ఏం తింటాంలే అని లైట్‌ తీసుకుంటారు. నిజానికి ఆ లేత కొబ్బరిలో ఎన్నో పోషకాలు, అద్భుత గుణాలుంటాయి.

లేత కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా మార్చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్లు లేత కొబ్బరి తినాలి. ఈ కొబ్బరి శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది. ఎండాకాలం డీహైడ్రేషన్‌ నుంచి తప్పించుకోవచ్చు. శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్‌ను లేత కొబ్బరి బయటకు పంపేస్తుంది. లేతకొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి గుండెకు మేలు చేస్తాయి. శరీరంలోని వ్యర్ధాల్ని బయటకు పంపుతాయి. పాడైన కణాల్ని బాగు చేస్తాయి.

లేత కొబ్బరిలో విటమిన్‌ ఎ,బి,సి థయామిన్‌, రైబోఫ్లావిన్‌, నియాసిన్‌, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము ఎక్కువగా ఉంటాయి. మల బద్ధకానికి సరైన ఉపశమనం లేత కొబ్బరి. రెండ్రోజులకొకసారి ఈ కొబ్బరి తిన్నా చాలు జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. కొబ్బరి కాయల్లో పచ్చి కొబ్బరిని తింటే దగ్గు, నిమ్ము, ఆయాసం వంటి సమస్యలు వస్తాయి. అదే లేత కొబ్బరి అయితే పెద్దగా సమస్యలే ఉండవు. కుదిరినప్పుడల్లా లేత కొబ్బరి తిని ఆరోగ్యాన్ని పెంచుకోండి.

Related posts

ఎక్కిళ్ళు తగ్గించే కరక్కాయ..

admin

అక్కడ మొటిమలకు కొబ్బరినూనె..!

admin

వాతావరణ మార్పులతో నిద్రకు భంగం!

admin