Mana Aksharam
  • Home
  • Health
  • వాతావరణ శాఖ హెచ్చరిక ….
Health Lifestyle Manavi

వాతావరణ శాఖ హెచ్చరిక ….

weather changes

వాతావరణ శాఖ హెచ్చరించినట్లే రాష్ట్రం అగ్నిగోళంలా మారుతుంది . మార్చి రెండో వారం నుంచి మొదలు ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. వేడి, వడగాలుల తీవ్రతకు జిల్లాల్లో ప్రజలు వడదెబ్బకు గురై ప్రాణాలు వదులుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మఖ్దుంపూర్‌లో బుధవారం అత్యధికంగా 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని జుక్కల్‌లో 38.9 డిగ్రీలు, బిచ్కుందలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌లో 39.2 డిగ్రీలు, ఉండవెల్లి మండలం పుల్లూరులో 38.8 డిగ్రీలు, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం చిన్నమావందిలో 39.1 డిగ్రీలు, నవీపేటలో 38.8 డిగ్రీలు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడలో 38.9 డిగ్రీలు, కొత్తకోట మండలం మిరాస్‌పల్లెలో 38.8 డిగ్రీలు, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం వేళ తప్పనిసరి అయితేనే బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఖచ్చితంగా తలకు టోపీ లేకుంటే రుమాలు ధరించాలని, సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని అంటున్నారు. మంచినీరు, నీటి శాతం అధికంగా ఉండే పళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు.
కరీంనగర్‌ జిల్లాల్లో వడగళ్ల వాన
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బుధవారం వడగళ్ల వాన కురిసింది. జిల్లాలోని వేములవాడ, చందుర్తి, బోయిన్‌పల్లి, గంగాధర, కరీంనగర్‌, చొప్పదండి, పెద్దపల్లి, కొడిమ్యాల, జగిత్యాల, నూకలమర్రి, అనంతపల్లి, గొల్లపల్లి, వెల్గటూరు, సారంగాపూర్‌, పెగడపల్లి, సుల్తానాబాద్‌లో రాళ్ల వర్షం కురిసింది. ఆకస్మికంగా వచ్చిన వడగళ్ల వానకు మామిడితోటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే కాస్తున్న మామిడి పిందేలు గాలిదుమారం, రాళ్ల వానకు రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

Related posts

ఆకుకూరలు కొన్నరోజే వాడుతున్నారా..!

admin

అజీర్తిని దూరం చేసే పుదీనా..

admin

మీ మేకప్ కిట్ ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసా?

admin