Mana Aksharam
  • Home
  • News
  • ‘వివేకానంద హత్య వెనక మంత్రి హస్తం’…సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

‘వివేకానంద హత్య వెనక మంత్రి హస్తం’…సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్

ఎన్నికల వేళ వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఆయన చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ, వైసీపీ పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. ఇప్పుడు ఏపీ రాజకీయమంతా వివేకానంద హత్య చుట్టూనే తిరుగుతోంది. వివేకానంద హత్య వెనక మంత్రి ఆదినారాయణ రెడ్డి హస్తముదని…ఈ కేసుపై సీబీఐ విచారణ చేయాలని వైసీపీ నేత మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు వైసీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి ఆదినారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో జగన్‌పై దాడి జరిగిన సమయంలోనూ తనపై నేరారోపణలు చేశారని గుర్తుచేశారు. ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కోలేకే వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మంత్రి ఆది విమర్శించారు. వైఎస్ కుటుంబంలోనే గొడవలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీగా ఓడిపోయిన నాటి నుంచే వైఎస్ వివేకానందరెడ్డి ఆవేదనలో ఉన్నారని ఆది అన్నారు. అబద్దాలు చెప్పడం వైఎస్ జగన్‌కు అలవాటుగా మారిపోయిందని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. కేసును విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆదినారాయణ.

Related posts

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి!

ashok p

కుల రాజకీయాలు చేస్తున్న బాబు : జగన్

ashok p

ఎమ్మెల్యేకి ఇల్లు కట్టిస్తున్న స్థానికులు

Harika