Mana Aksharam
  • Home
  • Spirituality
  • వృషభరాశివారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది
Spirituality

వృషభరాశివారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది

vrushabha raasi

వృషభరాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ రంగం వారైన ఈ సంవత్సరం కొంత ఎక్కువ జాగ్రత్తతో ఉండడం శ్రేయస్కరం. సామాజిక అనుబంధాలు, వివాహ అనుబంధాల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. భాగస్వాములతో జాగ్రత్తగా కలిసిమెలిసి ఉండేలా వ్యవహరించాలి. నవంబర్‌ తర్వాత అష్టమ సంచారం కూడా అంత మంచిది కాదు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి.సెల్ఫ్ డ్రైవింగ్ లో ఎక్కువ జాగ్రత్తలు అవసరం, ప్రయాణాలలో కుడా జాగ్రత్త వహించాలి. శని అష్టమ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి . రాజకీయ రంగం వారికి విజయం చేకురుతుంది. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తతో ఉండడం మంచిది. జనవరి 2020 తర్వాత శని నవమ సంచారం వలన ఆధ్యాత్మిక ప్రగతి కొంత పెరుగుతుంది. తీర్ధ యాత్రలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ఏ పని చేసిన అధిక శ్రమానంతరం సంతృప్తి లభిస్తుంది. రాహువు ద్వితీయ సంచారం వలన ఇతరులతో మాట్లాడేప్పుడు మాట తీరులో జాగ్రత్తగా పడాలి. తొందరపడి మాట్లాడకూడదు.

మీ ప్రవర్తనతో ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత కాలం విభేదాలు ఇబ్బంది పెడతాయి .స్థాన చలనములు, అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. కేతువు అష్టమ సంచారం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేరు. నిరాశ, నిస్పృహలు అధికంగా ఉంటాయి. పరామర్శలు చేస్తారు. హాస్పిటల్స్‌ కోసం ఖర్చులు చేస్తారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నందున వీరు మంచిపనులకై ఖర్చులు చేయడం మంచిది. గృహ శాంతి కాపాడుటకోరకు ఇష్టం లేకపోయినా జీవితంలో నటిస్తారు. గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఏ విషయంలోనూ తొందరపాటు పనికిరాదు. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయండి మంచిది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6.

Related posts

దైవ దర్శనం అనంతరం గుడిలో ఎందుకు కూర్చోవాలి?

admin

శ్రీకాళహస్తీశ్వరుని పూజిస్తే సిరిసంపదలు

admin

ఎండిపోయిన తులసి ఇంట్లో ఉంటే..

admin