Mana Aksharam
  • Home
  • Health
  • వేసవిలో చర్మాన్ని కాపాడేదెలా?
Health

వేసవిలో చర్మాన్ని కాపాడేదెలా?

రుతువులు మారే కొద్దీ, చర్మపు స్థితిగతులూ మారుతుంటాయి. శీతల కాలంలో అయితే మృత కణాలన్నీ ఒంటిమీద పేరుకుపోయి ఉంటాయి. వాటిని తొలగించే ఏ ప్రయత్నమూ చేయకపోతే, అవి అలాగే ఉండిపోయి మరికొన్ని ఇతర సమస్యలకు కూడా దారి తీస్తాయి. అందుకే…బాడీ సాల్ట్‌ ద్వారా గానీ, షుగర్‌ స్క్రబ్‌ల ద్వారా గానీ, ఒంటి మీద నిలిచిఉన్న మృత కణాలను తొలగించుకోవాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోవడమే కాదు, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.మృత కణాలను తొలగించేంచుకు అవపరమైన మిశ్రమాన్ని స్వయంగానే తయారు చేసుకోవచ్చు. అందుకు బ్రౌన్‌ షుగర్‌, వైట్‌ షుగర్‌, ఆలివ్‌ ఆయిల్‌, కొన్ని ల్యావెండర్‌ ఎస్సెన్షియల్‌ ఆయిల్‌ చుక్కలు కలిపి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు.కేవలం ఆలివ్‌ నూనె, కొబ్బరినూనెతో మర్దన చేసినా చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది స్నానం పూర్తి కాగానే మంచి బాడీ లోషన్‌ ద్వారా గానీ క్రీము ద్వారా గానీ సున్నితంగా మర్దన చేయాలి.బాగా పండిన ఒక అరటిపండు, ఒక అవకాడో, మూడు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి, స్వయంగానే కండీషనర్‌ను తయారు చేసుకుని వాడుకోవచ్చు.రోజుకు కనీసం 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి.పసుపు /ఆరెంజ్‌, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, నీలి /ఊదా ఈ ఐదు రంగుల్లో ఉండే పంఢ్లు, కూరగాయలు తరుచూ తింటూ ఉండాలి.శరీరానికి అవసరమైన కొవ్వు లభించే, అవకాడో, నెయ్యి, వెన్న, కొబ్బరినూనె, చేపలు, ముడిధాన్యాలు తరుచూ తినాలి.ఈ జాగ్రత్తల్లో ఏ కొన్ని పాటించినా, వేసవిలో చర్మం సంబంధమైన ఏ సమస్యలకు గురికాకుండా, చక్కని నిగారింపుతో ఉంటుంది.

Related posts

హోలీకి ముందు మరియు తర్వాత మీ జుట్టు సంరక్షణ

Masteradmin

ఒత్తిడికి కారణాలెన్నో..

admin

ఆకే క‌దా అని తీసి పారేస్తున్నారా..?

admin