Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • వైఎస్ జగన్ ప్రచార సభలో భారీ ప్రమాదం
Andhra Breaking Headlines Homepage-Slider News Politics Videos

వైఎస్ జగన్ ప్రచార సభలో భారీ ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం సందర్భంగా అపశృతి దొర్లింది. మండపేటకు జగన్ రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్లు మొత్తం రద్దీగా మారింది. దీంతో ప్రజలు భవనాల పైకి ఎక్కారు. ఈ సమయంలో రోడ్డుపక్కన ఉన్న భవనం పిట్టగోడ కూలింది. ఈ ప్రమాదంలో భవనంపైన ఉన్న సుమారు 20 మంది గాయపడ్డారు. అదే సమయంలో భవనం కింద నిలబడిన మరో 10 మందికి కూడా దెబ్బలు తగిలాయి. ఘటన జరిగిన వెంటనే గాయపడిన వారిని మండపేట ఆస్పత్రికి తరలించారు. బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. ఎక్కువ దెబ్బలు తగిలిన వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని భావిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ర్యాలీలో బిజీగా ఉండడంతో, వైసీపీ నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. అవసరమైతే బాధితులను ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స అందించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Related posts

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జగన్‌ సంచలన ట్విట్‌

admin

‘ప్యాకేజీ’ చంద్రబాబు అంగీకరించలేదా..?

Masteradmin

ఘోర రోడ్డు ప్రమాదంలో టీవీ ఆర్టిస్టు మృతి

Manaaksharam