Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యే.. పోస్టుమార్టం రిపోర్టు
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యే.. పోస్టుమార్టం రిపోర్టు

వైఎస్ వివేకానంద రెడ్డి మృతి విషయంలో సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. అందరూ అనుమానిస్తున్నట్లు ఆయనది హత్యేనని వెల్లడైంది. పోస్టుమార్టం రిపోర్టులో ఈ విషయం తేలింది. వివేకానంద రెడ్డి ఒంటిపై ఏడు చోట్ల కత్తితో పొడిచిన గాయాలనున్నట్లు తేలింది. తల వెనుక భాగంలో బలమైన గాయమైనట్లు గుర్తించారు. నుదుటిపై రెండు చోట్ల లోతైన గాయాలున్నాయి. తొడ, చేతి వేళ్లపైనా గాయాలున్నట్లు తేలింది. దీంతో వైఎస్ వివేకానంద రెడ్డిది ప్రాథమికంగా హత్యగానే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మురం చేశారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకు గురైనట్టు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆయన భౌతికకాయానికి కొద్దిసేపటి కిందటే రిమ్స్‌ వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేశారు. ఆ తర్వాత ఆయన భౌతికకాయాన్ని పులివెందులకు తరలించారు. ఆయన శరీరంలో ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. తలలో రెండు వైపులా కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయని.. ఛాతి, చేతిపైనా కత్తి పోట్లు ఉన్నట్టు తెలిపారు.

వివేకానంద రెడ్డి మృతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ వెల్లడించారు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ సిట్‌‌ ఏర్పాటు చేశారు.

మాజీ మంత్రి, జగన్‌ చిన్నాన్న వివేకానంద రెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. దోషుల్ని వెంటనే అరెస్టు చేయాలని.. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని అధికారులకు సూచించారు. పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి మృతిపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

Related posts

మెక్సికోలో భారీ భూకంపం: 149 మంది మృతి

ashok p

జగన్ గూటికి వైయస్ ఆప్తులు!

ashok p

ఆంధ్ర,తెలంగాణాలో కూడా జెండా ఎగరేస్తాం! : బీజేపీ

ashok p