Mana Aksharam
  • Home
  • Health
  • శరీర బరువును తగ్గించే బీన్స్
Health

శరీర బరువును తగ్గించే బీన్స్

beans to reduce weight

ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఎన్నో రకాల కూరగాయలను సేవిస్తాం. అలా రోజు తినే కూరగాయాలలో మనకు ఎన్నో పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి. అయితే ఒక్కొ కూరగాయలో ఒక్కో రకమైన పోషకలు, ప్రోటీన్లు ఉంటాయి. మరి ఇప్పుడు శరీర బరువును తగ్గించే కూరగాయ గురించి తెలేసుకుందాం. అదే బీన్స్… ఈ కూరగాయ శరీర బరువును నియంత్రించటంలో ఎంతగానో దోహదపడుతుంది. బీన్స్ లో యాంటీ-ఆక్సిడెంట్స్, విటమిన్స్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటి మినరల్స్ పుష్కలంగా లభ్యమవుతాయి. ఇది తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. బీన్స్ ని సంపూర్ణ ఆహార పదార్థంగా ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బీన్స్ లో నెమ్మదిగా జీర్ణమయ్యే సంక్లిష్ట కార్బోహైడ్రెట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బీన్స్ ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాకుండా రక్తంలోని గ్లోకోజ్ స్ధాయిలను తగ్గిస్తుంది. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి బీన్స్ ని క్రమం తప్పకుండా తినటం వలన పిట్ గా, ఆరోగ్యంగా ఉంటారు. బీన్స్ లో ఫైబర్లు కూడా ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. దీంతో మలబద్దక సమస్యలు తగ్గిపోతాయి. బీన్స్ ప్రతి రోజు తీసుకోవటం వలన అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. శరీర పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి విస్తారమైన ప్రోటీన్స్ ని బీన్స్ అందిస్తుంది. బీన్స్ ప్రోటీన్స్కు ఎక్కువగా ఉంటాయి శాఖాహారులకు దీనిని మంచి ఆహార పదార్థంగా చెప్పుకోవచ్చు బీన్స్లో ఎక్కువ ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. బీన్స్ వలన ఆరోగ్యానికి జరిగే మేలు గురించి తెలుసుకున్నారు… కదా.. అయితే వారానికి రెండుసార్లైనా తిని ఆరోగ్యాని మెరుగుపరుచుకొండి..

Related posts

మీరు సరిగ్గానే బ్రష్ చేస్తున్నారా?

ashok p

వేగంగా బరువు తగ్గించే గులాబీ రేకులు

Manaaksharam

పరగడుపునే టీ, కాఫీలు తాగుతున్నారా?

ashok p