Mana Aksharam
Crime Entertainment News

షణ్ముఖ్ వినయ్ అరెస్ట్

shanmukh vinay arrest

సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసే వ్యక్తి సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ ఓ యువతిని నమ్మించి అత్యాచారం చేసి మోసం చేసాడు. భాదితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై అత్యాచారం, అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మాదాపూర్‌ ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్‌లోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన శణ్ముఖ్‌ వినయ్‌(24) మాదాపూర్‌లోని మస్తాన్‌నగర్‌లో నివాసముంటూ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. దీప్తి సునైనా చేసిన రౌడీ బేబీ పాటను కూడా ఇతనే డైరెక్ట్ చేసి మంచి హిట్ నేమ్ సొంతం చేసుకున్నాడు. నృత్యకారుడు మెహబూబ్‌తో ఇతనికి పరిచయం ఏర్పడింది. నృత్యకారిణులు కావాలంటూ మెహబూబ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన విడుదల చేశాడు. ఇది చూసి బోడుప్పల్‌కు చెందిన ఓ యువతి(24) ఈ ఏడాది జనవరి 8న చర్లపల్లికి వెళ్లింది. అక్కడ వినయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఆమెను నమ్మించి ఫోన్‌ నెంబర్‌ తీసుకొని మాటలు కలిపాడు. సినిమా నటులను పరిచయం చేయిస్తానని చెప్పి జనవరి 11న అమీర్‌పేటకు రావాల్సిందిగా చెప్పాడు. ఆమెను తన బైకుపై మాదాపూర్‌కు తీసుకువచ్చాడు. గోల్డెన్‌గేట్‌ టవర్స్‌ భవనంలో ఓయో రూమ్స్‌తో గది బుక్‌ చేసుకొని తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు నుంచి ఆమె ఫోన్‌ చేస్తున్నా వినయ్‌ స్పందించడం లేదు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా యువతి అతన్ని వేడుకుంది. కులం తక్కువ మహిళను చేసుకోలేనని, దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడు. దీంతో బాధితురాలు మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించగా, బుధవారం నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

Related posts

మళ్లీ తెరపైకి కిరణ్ కుమార్ రెడ్డి

Manaaksharam

టీటీడీ ఛైర్మన్‌ కు హైకోర్టులో ఊరట..

ashok p

సభ ప్రారంభం కాకముందే విమర్శల భాణాలు వదిలిన కెసిఆర్!

ashok p