Mana Aksharam
  • Home
  • News
  • Technology
  • షావోమి చౌక స్మార్ట్‌ఫోన్ ‘రెడ్‌మి గో’.. ధర ఎంతో తెలుసా?
Technology

షావోమి చౌక స్మార్ట్‌ఫోన్ ‘రెడ్‌మి గో’.. ధర ఎంతో తెలుసా?

redmi go price in india

చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ షావోమి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దాని పేరు రెడ్‌మి గో. న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది.

షావోమి నుంచి వస్తున్న తొలి గూగుల్ ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి గో. మ్యాప్స్ గో, యూట్యూబ్ గో వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. వివిధ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. ఈ ఫోన్ తొలి సేల్ మార్చి 22న మద్యాహ్నం 12 గంటలకు ప్రారంభమౌతుంది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.

షావోమి రెడ్‌మి గో స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఉండొచ్చు. అలాగే 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ప్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ వంటి ఫీచర్లు ఉండొచ్చు. ఈ ఫోన్ ధర రూ.4,499. ఈ ఫోన్‌పై జియో రూ.2,200 వరకు క్యాష్‌బ్యాక్, 100 జీబీ డేటాను అందిస్తోంది.

Related posts

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు వచ్చేశాయ్..

admin

‘వన్నాక్రై’కి మించిన మరో సైబర్‌ దాడి

Masteradmin

ఫ్రీ జియో ఫోన్‌.. ప్రీ బుకింగ్స్‌ త్వరలో..

admin