Mana Aksharam
  • Home
  • Breaking
  • సామజిక బాధ్యతతో మీముందుకువచ్చాఆశీర్వదించండి . సినీ నటి ఊర్మిళ
Breaking National News Politics

సామజిక బాధ్యతతో మీముందుకువచ్చాఆశీర్వదించండి . సినీ నటి ఊర్మిళ

ఇలాంటి రాజకీయాలు నాకు నిజంగా తెలియవు . ఏదేమై నా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడటం న లక్ష్యం అని చెబుతున్నారు ఊర్మిళ. బీజీపీ అభ్యర్థి గోపాల్‌ శెట్టితో ఆమె పోటీ పడనున్నారు. రాజకీయ అనుభవం ఉన్న ఆయన, ఊర్మిళకు రాజకీయం జ్ఞానం సున్నా అని విమర్శించారు. ఆమె ఈ మాటలేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. కానీ ఆయన తీరును మాత్రం ఆమె బాగా అర్థం చేసుకున్నారు. ‘‘ఆయన మాటలను బట్టి ఆయన తీరు అర్థమవుతోంది. ఆయన నా గురించి హేళనగా, తప్పుగా మాట్లాడుతున్నారు. దీని వెనుక రెండు విషయాలు ఉండవచ్చు. ఆయనకు తన మీద విశ్వాసం తగ్గిపోవటం, లేదా లోపల దాగి ఉన్న భయాలన్నీ ఈ రూపంలో బయటకు వస్తుండవచ్చు. ఆయన, ఆయన పార్టీ వాళ్లు ఎక్కువగా ఆవేశపూరిత వాతావరణంలోకి అవతల వాళ్లని నెట్టాలని ప్రయత్నిస్తుంటారు. మతాత్మక, సామాజిక–ఆర్థిక అంశాలతో ప్రజలను బిజీగా ఉంచుతారు. దీని వల్ల ప్రజలు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టరు. అలాంటప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?’’ అని ప్రశ్నించారు ఊర్మిళ. ఒకవేళ అలాంటి రాజకీయాలు నాకు తెలియవని ఆయన అంటే, అలాంటి రాజకీయాల్లో నేను జీరోగా ఉండటమే తనకు సంతోషం అని అన్నారామె. ప్రజలు నన్ను నమ్మి విజయం చేకూర్చాలని కోరారు.

Related posts

కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడు: ప్రత్యేకతలెన్నో..

Masteradmin

ఢిల్లీలో స్వరం పెంచిన వైసీపీ!

admin

చంద్రబాబుని పొగిడారా..? తిట్టారా..?

admin