Mana Aksharam
  • Home
  • Spirituality
  • సాయి బాబా ఎక్కడ పుట్టారో తెలుసా
Spirituality

సాయి బాబా ఎక్కడ పుట్టారో తెలుసా

సాయిబాబా … ఈయనకు భారతదేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. భక్తులైతే ఉన్నారు గానీ … సాయిబాబా గురించి చాలా మందికి తెలియనిది అయన అసలు పేరు, అయన పుట్టిన ప్రదేశం. వీటి గురించి తెలియక చాలా మంది పుస్తకాలు, పాత ఆర్టికల్స్ తిరుగేస్తుంటారు. కానీ ఈ మధ్యనే అయన పుట్టిన ప్రదేశం వెలుగులోకి వచ్చింది అదే పత్రి. పత్రి సాయిబాబా కాలంలో ఒక గ్రామం. కానీ నేడు ఒక సిటీగా మరియు మున్సిపాలిటీగా అవతరించింది. మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలో పత్రి సిటీ కలదు. ఈ సిటీ ప్రధాన ఆకర్షణ ఆయన జన్మించిన ఇంటిస్థానంలో కట్టిన శ్రీ సాయి జన్మస్థల్ టెంపుల్. ఈ మందిరాన్ని దర్శించుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

శ్రీ సాయి జన్మస్థాన్ ఆలయం లో షిర్డీ సాయిబాబా జన్మించారు. ఈ ప్రదేశాన్ని మొట్టమొదట సాయిబాబా భక్తుడు మరియు రీసెర్చర్ అయిన వి.బి. ఖేర్ 1975 వ సంవత్సరంలో కనిపెట్టారు. ఈయన శ్రీ సాయి స్మారక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించాలని అనుకొని సాయి పుట్టిన ఇంటిని కొనుగోలు చేసి 1994లో పనులు మొదలుపెట్టి, 1999 లో దీనిని జాతికి అంకితం చేసారు. ప్రముఖ స్వామీజీలైన పుట్టపర్తి సాయిబాబా, మాధవనాథ్ లు కూడా ‘పత్రి’ నే సాయిబాబా జన్మస్థలంగా నిర్ధారించారు. ఆలయం నిర్మించేటప్పుడు సాయిబాబా జన్మించిన ఇంట్లో దొరికిన వస్తువులు మరియు పునాదులు మరియు ఇతర పరికరాలను మందిర ప్రాంగణంలో మనం చూడవచ్చు.

Related posts

సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతం

Manaaksharam

గుడిలో తీర్థం సేవించినపుడు ఇలా చేయకూడదు!

ashok p

మూషికాలయం గురించి ఎప్పుడైనా విన్నారా?

ashok p