Mana Aksharam
  • Home
  • Spirituality
  • హనుమంతుడి అనుగ్రహం పొందడం ఎలా?
Spirituality

హనుమంతుడి అనుగ్రహం పొందడం ఎలా?

how to get blessings from hanuman

హనుమంతుడు చిరంజీవుడు, ఆరోగ్య, శత్రు పీడ, దిష్టి దోషాలని ఒక్క దెబ్బతో పటాపంచలు చేస్తాడు. శ్రీరామ భక్తుడు అయినా హనుమంతుడిని ఈ విధంగా పూజిస్తే మనకి మన కుటుంబానికి అన్ని ఆరోగ్య సమస్యలు పోయి కుటుంబం సంతోషంగా భోగ భాగ్యాలతో కళకళలాడుతుంది. ముందుగా ప్రతి మంగళవారం తలస్నానం, పూజ గది శుభ్రం చేసి వినాయకుడికి నమస్కరించాలి ఆ తర్వాత సీతా సమేత శ్రీరామచంద్రుడు మరియు ఆంజనేయస్వామి ఫోటో పెట్టాలి, ఇలా పెట్టాకా స్వామివారికి కుంకుమా లేదా సింధూరంతో బొట్టు పెట్టాలి.

స్వామి వారికీ 11సంఖ్యా ఏదైనా సువాసన భరితమైన పువ్వులు 11 పువ్వులు సమర్పించాలి, అలాగే నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. ఇప్పుడు స్వామివారికి హనుమాన్ చాలీసా చదువుతూ 11 బిల్వపత్రాలు సమర్పించాలి. ఒకవేళ హనుమాన్ చాలీసా అందుబాటులో లేకపోతె ఈ స్తోత్రాన్ని 3 సార్లు చదివి బిల్వపత్రం సమర్పించాలి.
“శ్రీరామ రామ రామేతి ,
రమే రామే మనోరమే;
సహస్ర నామ తతుల్యం,
రామ నామ వరాననే.”
ఈ స్తోత్రం చదివాక అరటిపండ్లను నైవేద్యంగా పెట్టాలి,ఇలాగా చేస్తే మీకున్న అన్ని ఆరోగ్య సమస్యలు పోయి నిత్యం సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి.

Related posts

శ్రీకాళహస్తీశ్వరుని పూజిస్తే సిరిసంపదలు

ashok p

షణ్మతాలు అంటే ఏమిటో తెలుసా?

ashok p

ఉగాది.. మానవుల ఆయుష్షుకు తొలి రోజు!

Manaaksharam