Mana Aksharam
  • Home
  • News
  • 2019 ఎల‌క్ష‌న్స్: ఏపీలో అధికారం ఎవ‌రిది.?
Breaking Editorial Headlines Homepage-Slider News Politics Top Read Stories

2019 ఎల‌క్ష‌న్స్: ఏపీలో అధికారం ఎవ‌రిది.?

ఈసారి నేనే.. బాబూ

దేశవ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా జంపింగ్ జిలానీలు ఎక్కువ‌య్యారు. ప‌ట్టున్న సీట్ల కోసం అధికార, ప్ర‌తిప‌క్షం అనే తేడాలేకుండా గోడ దూకెస్తున్నారు. ముందు వ‌రుస‌లో ఎక్కువ‌గా తెలుగు పార్టీ నేత‌లు అని చెప్పుకోవ‌చ్చు. నిన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేలుగా చ‌క్రం తిప్పి మ‌రికొన్ని నెల‌ల్లో ఎన్నిక‌లు వ‌స్తుండ‌టంతో వైసీపీ గూటికి చేరిపోరుతున్నారు. అధిష్టానం నుంచి ఆశించిన‌ హామీ రాక‌పోవ‌డంతోనే వెళ్లిపోవాల్సి వ‌చ్చింద‌ని జంపింగ్ జిలానీలు చెబుతున్న మాట‌. అయితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ మాత్రం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మాకు క‌లిసివ‌స్తోంద‌ని ధీమా ఉంది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014 ఎన్నిక‌లకు ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వైఎస్ జ‌గ‌న్ ర‌థ‌సార‌థి కాబోతున్నార‌ని అంతా అనుకున్నారు.

కానీ కొన్ని హామీల విష‌యంలో జ‌గ‌న్ వెన‌క్కిత‌గ్గ‌డంతో ఆ ఛాన్స్ చంద్ర‌బాబుకు ద‌క్కింద‌నేది వైసీపీలోని కొంద‌రి మాట‌. అలా వెన‌క్కి త‌గ్గ‌డ‌మే కోస్తాంధ్ర‌లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి మైన‌స్ అయింది. దాని ఫ‌లితంగా త‌క్కువ సీట్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. జ‌గ‌న్ వ్యూహాన్ని ముందుగానే ప‌సిక‌ట్టిన చంద్ర‌బాబు.. రాష్ట్ర ప‌రిస్థితుల‌ను త‌న‌కు అవ‌కాశంగా మార్చుకున్నారు. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి, ఉత్తరాంధ్ర‌లో వైసీపీని దెబ్బ‌కొట్టాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను లైన్లోకి తీసుకొచ్చారు.

ప‌వ‌న్ అండ‌తో తూర్చు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అత్య‌థిక స్థానాలు గెలిచారు. దీంతో చంద్ర‌బాబు వ్యూహం స‌క్సెస్ అయింది.

చంద్ర‌బాబు అంచనాల‌ను ప‌సిగ‌ట్ట‌లేని జ‌గ‌న్.. ప్ర‌తిప‌క్షానికే ప‌రిమిత‌మయ్యారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితులు లేవు. జ‌గ‌న్ పాద‌యాత్రతో అక్కడి రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను పూర్తిగా మార్చేశార‌ని లోకల్ వైసీపీ నేత‌లు అంటున్న మాట‌లు. తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో కాపులు ఎక్కువ కాబ‌ట్టి..ప్ర‌స్తుతం వారంతా త‌మ వైపే ఉన్నార‌ని భావిస్తున్నారు. అటు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భావం కూడా పెద్దగా ఉండ‌ని అంటున్నారు.

ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు మద్ద‌తిచ్చిన ప‌వ‌న్.. కాపుల‌కు ఏం చేశార‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు ప‌వ‌న్ యాత్ర‌ల్లో స్పంద‌న క‌నిపిస్తున్నా అది ఓటుపై ప్ర‌భావం చూప‌లేద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

ఈ ప‌రిణామాల‌పై ఫోక‌స్ పెట్టిన జ‌గ‌న్.. కోస్తాంధ్ర‌, ఉత్తరాంధ్ర‌పై ప‌ట్టుకోసం ఆప‌రేష‌న్ అక‌ర్ష్ ప్ర‌యోగించారు. ఈసారి ఎలాగైనా స‌రే వైసీపీ జెండా ఎగుర‌వేయాల‌ని పావులు క‌దుపుతున్నారు. తొలుత అమ‌లాపురం ఎంపీ అంవంతి శ్రీనివాస్ ను, ఆ త‌ర్వాత చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ను వైసీపీ గూటికి చేర్చుకున్నారు. ఇదే క్యూలో మ‌రికొంత‌మంది టీడీపీ నేత‌లు ఉన్న‌ట్లు వైసీపీ నేతలు లెక్క‌లు వేస్తున్నారు.

ఈ ప‌రిణామాల‌పై టీడీపీ నేత‌లు మాత్రం.. త‌మ పార్టీ నుంచి ఎంత‌మంది వెళ్లిపోయినా మాకేం న‌ష్టం లేదని భావిస్తున్నారు.

మా స‌ర్వేల్లో ఓట‌మిపై తెలిసిన నేత‌లే పార్టీ వీడుతున్నారంటూ చెప్పుకుంటున్నారు.

మ‌రోవైపు కొన్ని ప్రైవేటు సంస్థ‌లు చేసిన స‌ర్వేల్లో 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

వీటిని బేరీజు వేసుకున్న చంద్ర‌బాబు.. ప్ర‌జా సంక్షేమం పేరుతో ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాల‌ను మ‌రింత వేగంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే కొన్నిచోట్ల టీడీపీ నేత‌ల అర‌చ‌కాలు, అవినీతి ఆరోప‌ణ‌లు..ఈ ప‌థ‌కాలు ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయ‌నేది ఆ పార్టీలోని ప‌లువురు అంటున్న మాట‌. ఎన్నిక‌ల ముందు ఇలాంటి మారేడు కాయాల్ని ప్ర‌జ‌లు న‌మ్ముతారా అని వారిలో వారే ప్ర‌శ్నించుకుంటున్నారు.

అటు వైసీపీ మాత్రం అధికారంలోకి వ‌స్తామ‌నే విశ్వాసన్ని వ్య‌క్తం చేస్తోంది.

ఈ సారి ఎలాగైనా స‌రే అధికారం మాదే అంటున్న జ‌గ‌న్.. అధికార పార్టీ వ్యూహాల‌కు ప‌దునైన ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తున్నారు.

తండ్రి వైఎస్ ఆశ‌యాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డ‌మే త‌న ల‌క్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు.

ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలే త‌మ‌కు మ‌రో అవ‌కాశాన్ని క‌ల్పిస్తామ‌ని అటు సీఎం చంద్ర‌బాబు కూడా అంచ‌నాలు వేస్తున్నారు.

మ‌రి ఈ నేప‌థ్యంలో 2019 ఎల‌క్ష‌న్స్ ఎవ‌రివైపు ఉంటాయో చూడాలి మ‌రి.

Related posts

ఎట్టకేలకు వెనక్కు తగ్గినా పరిటాల వర్గం!

ashok p

పిడుగురాళ్ల పట్నంలో అర్ధ రాత్రి హైడ్రామా..

Manaaksharam

వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధుల్లో ప్రత్యేకతలు

Manaaksharam