Jio బాటలోనే Airtel, Vodafone కూడా! అక్టోబర్ 14న ఏం జరగబోతోంది?

Jio బాటలోనే Airtel, Vodafone కూడా! అక్టోబర్ 14న ఏం జరగబోతోంది?

ప్రస్తుతం టెలికాం రంగంలో యుద్ధం జరుగుతోంది. కాల్ చార్జీల గురించో, డేటా పరిమితి గురించో, రీచార్జ్ మొత్తాల గురించో అనుకుంటున్నారా? కాదు. రింగ్ టైమ్ గురించి. రింగ్ టైమ్ అంటే.. మీరు వేరే వారికి ఫోన్ చేసినప్పుడు మీ కాల్ లిఫ్ట్ చేయడానికి మీ నెట్ వర్క్ అవతలి నెట్ వర్క్ వారికి ఇచ్చే సమయం. అంటే వారి ఫోన్ రింగయ్యే సమయం. ఇందులో ఏముంది.. దీని కోసం ఎందుకంతలా గొడవలు పడటం అంటారా? అక్కడే ఉంది అసలు సంగతి.

మీరు వేరే నెట్ వర్క్ వాళ్లకి కాల్ చేశారనుకోండి. మీ నెట్ వర్క్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ల నెట్ వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కి నిర్దేశిత రుసుమును చెల్లించాలి. దీన్ని ఐయూసీ(ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జ్) అంటారు. చాలా వరకు సర్వీస్ ప్రొవైడర్లకు మనం చేసే రీచార్జ్ మొత్తాల కంటే ఈ ఐయూసీనే ప్రధాన ఆదాయ వనరు. జియో వచ్చాక మిగతా నెట్ వర్క్ లకు రీచార్జ్ ల రూపంలో దెబ్బపడినా ఈ ఐయూసీలు బాగా ఎక్కువ రావడంతో కాస్తలో కాస్త నిలదొక్కుకునే స్థాయిలో ఉన్నాయి.

అయితే జియో రింగ్ టైమ్ ను 20 సెకన్లకు తగ్గించినప్పుడు మొదలైంది అసలు రచ్చ. దీని కారణంగా మా యూజర్లు తిరిగి కాల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రింగ్ టైమ్ ను తిరిగి 30 సెకన్లకు పెంచాలని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా డిమాండ్ చేశాయి. దీనిపై సెప్టెంబర్ 6న ట్రాయ్ సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం కూడా నిర్వహించింది. అయితే అంతర్జాతీయంగా రింగ్ టైమ్ 15-20 సెకన్ల స్థాయిలోనే ఉందని దీన్ని పెంచేది లేదంటూ జియో తెగేసి చెప్పింది. అనంతరం ఎయిర్ టెల్.. పెంచకపోతే జియో నుంచి వచ్చే ఇన్ కమింగ్ కాల్స్ ను తమ నెట్ వర్క్ కు నిషేధిస్తామని చెప్పడంతో తప్పక దాన్ని 25 సెకన్లకు పెంచింది.


336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*