అయ్యో.. బన్నీ కూడా హ్యాండ్‌ ఇచ్చాడా..!

అయ్యో.. బన్నీ కూడా హ్యాండ్‌ ఇచ్చాడా..!

రంగస్థలం లాంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ తరువాత దర్శకుడు సుకుమార్‌ ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించలేదు. ముందుగా మహేష్ బాబుతో సుకుమార్‌ సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్‌ మీదకు వెళ్లలేదు. తరువాత వెంటనే అల్లు అర్జున్‌ హీరో సుకుమార్ సినిమా అంటూ అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ లోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాను ప్రారంభించాడు బన్నీ. ప్రస్తుతం ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే సుకుమార్‌ సినిమాను ప్రారంభించాలని ప్లాన్ చేశాడు బన్నీ. అందుకే దసరా రోజున సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారన్న ప్రచారం జరిగింది.

కానీ తాజాగా బన్నీ, సుకుమార్‌ల సినిమాల ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. సెకండ్‌ హాఫ్ విషయంలో హీరో దర్శకుల మధ్య ఏకాభిప్రాయం కుదరనందువల్లే ప్రాజెక్ట్ డిలీ అవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. కానీ సుకుమార్‌ సన్నిహితులు మాత్రం అలాంటిదేమి లేదంటున్నారు. ఇప్పటికే కథా కథనాలు సిద్ధమయ్యాయని త్వరలోనే దేవీ శ్రీ ప్రసాద్‌ సారధ్యంలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా ప్రారంభమవుతాయని చెపుతున్నారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*