అయోధ్య తీర్పుపై స్పందించిన యాంకర్ రష్మీ!

తాజాగా దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న అయోధ్య కేసు తీర్పుపై జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ కూడా స్పందించింది. జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్…సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అనేక సామాజిక అంశాల పట్ల కూడా స్పందిస్తూ ఉంటుంది. దీంతో పాటు కొన్ని పండగ పబ్బాల సందర్భంగా మంచి మెసేజులు కూడా తన అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న అయోధ్య కేసు తీర్పుపై కూడా ఈ జబర్దస్త్ బ్యూటీ స్పందించింది. తన ట్విట్టర్‌లో జై శ్రీరామ్ అంటూ పోస్టు పెట్టింది. దీంతో రష్మీ ట్వీట్‌ను ఆమె అభిమానులు సైతం లైకులు కొడుతున్నారు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అన్ని విషయల్ని షేర్ చేస్తూ వస్తుంటుంది రష్మీ. వాటితో పాటు.. పలు సామాజిక అంశాల పట్ల కూడా అప్పుడప్పుడు ట్వీట్లు పెడుతుంటుంది. తమిళనాడులో బోరుబావిలో రెండేళ్ల చిన్నారి పడిపోయినప్పుడు కూడా రష్మీ తనవంతుగా ట్వీట్ చేసింది. ఏదేమైనా తమ అభిమాన యాంకర్… ఈ విషయంలో మాత్రం టాప్ అంటూ… ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రష్మీ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*