కాకాణి వర్సెస్ కోటంరెడ్డి..

కాకాణి వర్సెస్ కోటంరెడ్డి..

వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి పంచాయితీ అమరావతికి చేరింది. ఇద్దరు ఎమ్మెల్యేలతో పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి, మంత్రి అనిల్‌.. ఎంపీలు ఆదాల, వేమిరెడ్డిలు సమావేశమయ్యారు. వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో చర్చలు జరుపుతున్నారు. తాజా పరిణామాలతో పాటూ స్థానిక సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలోనూ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తోంది. విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో ముందుకు సాగాలని ఇద్దరికి సర్థిచెప్పినట్లు సమాచారం.

నెల్లూరు వైఎస్సార్‌సీపీలో కోటంరెడ్డి ఎపిసోడ్ కలకలంరేపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వెంకటాచలం ఎంపీడీవో సరళ చేసిన ఆరోపణలు.. ఫిర్యాదుతో కేసు నమోదు చేయడం.. ఆ వెంటనే అరెస్ట్, బెయిల్ కూడా వచ్చింది. తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన శ్రీధర్‌రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఉన్నట్లు జిల్లాలో చర్చ నడిచింది. ఈ వివాదానికి కూడా అదే కారణమనే ప్రచారం జరిగింది.

కోటంరెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అనుచరుడి కుళాయి కనెక్షన్ గురించి ఎంపీడీవోను అడిగితే.. ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దని తనతో చెప్పారన్నారు. ఎమ్మెల్యే కాకాణికి ఫోన్ చేసి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని అడిగితే.. దానికి ఆయన ఇప్పుడు కుదరదు అన్నారని చెప్పుకొచ్చారు. అంతటితో తాను ఆ సంగతి వదిలేశానన్నారు. ఎంపీడీవో సరళ తన నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఎమ్మెల్యే కాకాణి ఇంటికెళ్లారని శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమందిలా.. తాను చీకట్లో చంద్రబాబు కాళ్ళు పట్టుకోలేదన్నారు.


336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*