‘నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండి’

‘నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండి’

‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’, ‘తుమారీ సులు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలీవుడ్ నటి విద్యా బాలన్. ఓ పక్క తన అందాలతో హాట్ హాట్‌గా ప్రేక్షకులను మెప్పిస్తూనే మరోపక్క హోమ్లీ పాత్రల్లో నటిస్తున్నారు. నాలుగు పదుల వయసులో ఆమెలాంటి నటీమణులు అక్క, వదిన పాత్రల్లో నటిస్తుంటారు. కానీ విద్య అలాంటి నియమాలేవీ పెట్టుకోలేదు. డర్టీ పిక్చర్ సినిమా విడుదలయ్యాక చాలా మంది విద్యపై మండిపడ్డారు. ఈ వయసులో ఆ పాత్రల్లో నటించడమేంటి అని దుమ్ము దులిపేశారు. అయినా విద్య ఇవేవీ పట్టించుకోలేదు. తనకు నచ్చిన స్క్రిప్ట్స్‌లో నటిస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శకుంతలా దేవి’. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరుగాంచిన గణితవేత్త శకుంతలా దేవి జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విద్య తనపై కామెంట్స్ చేసేవారికి గట్టి బుద్ధిచెప్పారు. ‘నేనంటే ఇష్టంలేని వారు నేను నటించే సినిమాలు కూడా చూడనక్కర్లేదు. డర్టీ పిక్చర్, కహానీ సినిమాల తర్వాత నేను సొంతంగా సినిమాలను ఎంపిక చేసుకోవడం నేర్చుకున్నాను. నా బోల్డ్‌నెస్‌తో నేను అన్ని భాషల్లోనూ నటిస్తున్నాను. నేను ఎంపిక చేసుకునే సినిమాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. నేనంటే ఇష్టం లేని వారు నా సినిమాలు చూడాల్సిన అవసరం లేదు కదా..’ అని వెల్లడించారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*