Cinema

”రాధేశ్యామ్‌” కొత్త పోస్టర్‌..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్. ఈ అద్భుతమైన ప్రేమ కథకు సంబంధించి “రాధే శ్యామ్” నిర్మాతలు ఈరోజు జన్మాష్టమి సందర్భంగా కొత్త పోస్టర్‌ ఆవిష్కరించారు. ప్రభాస్ పోస్టర్‌లో క్లాస్‌గా కనిపిస్తున్నాడు. పూజా హెగ్డే  చూపుతిప్పుకోనివ్వకుండా ఉంది. బ్లూ డ్రెస్ పై నెమలి పింఛం అలంకరణతో కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెబుతున్నట్టుంది. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టుంది.

Read More »

దసరా బరిలో మహాసముద్రం

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘మహా సముద్రం’. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు. అజరు భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 14న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఒక మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

Read More »

బస్సులో సమంత, నయన్‌తార

స్టార్‌ కథానాయకులు సమంత, నయనతార నటిస్తున్న తమిళ చిత్రం కాతువకుల రెండు కాదల్‌ అనే సినిమా తెరకెక్కుతోంది. మక్కల్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరో నటిస్తున్న ఈ చిత్రాన్ని నయన్‌ బాయ్ ఫ్రెండ్‌, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ వీడియో ఒకటి నెటింట్లో వైరల్‌గా మారింది. బస్సులో హీరో, హీరోయిన్లు ప్రయాణీస్తున్న ఈ సీన్‌ను పలువురు మొబైల్లో తీసి..సోషల్‌ మీడియాలో పెట్టడంతో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సమంత, నయన్‌ ఇద్దరూ కూడా తెల్ల రంగు చీరలు కట్టుకుని బస్సు ఫుట్‌బోర్డుపై ఉండగా ...

Read More »

అక్కినేని పేరు తొల‌గింపుపై సమంత క్లారిటీ

అక్కినేని వారి కోడ‌లు, స్టార్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు చాలా పరిమితంగానే సినిమాల‌కు సైన్ చేస్తూ వ‌స్తున్నారు. చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు స‌మంత ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. మ‌రోవైపు వ్యాపార రంగంలోనూ, సోష‌ల్ మీడియాలోనూ  బిజీగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని సంద‌ర్భాల్లో సామ్ త‌నకు తానుగా కాంట్ర‌వ‌ర్సీలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతున్నారు. పెళ్లి త‌ర్వాత స‌మంత అక్కినేని అంటూ త‌న ఇన్‌స్టా ప్రొఫైల్ పేరును మార్చుకున్న ఈ అమ్మ‌డు రీసెంట్‌గా, అక్కినేని పేరుని తీసేసి, కేవ‌లం ‘ఎస్’ ...

Read More »

కుమారుడి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌

విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటీ మళ్లీ పెళ్లా..? పెళ్లికూతురెవరు..? ఎప్పుడు.. ఎక్కడ అని సందేహిస్తున్నారా..! మంగళవారం ఆగస్టు 24న తన వివాహమహోత్సవం రోజున కుమారుడు వేదాంత్‌ కోరిక మేరకు.. అతని ఎదుటే భార్య పోనీవర్మకి ప్రకాశ్‌రాజ్‌ ఉంగరం తొడిగాడు. ఇలా తన భార్యనే… తాను మరోసారి వివాహం చేసుకున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. మా వివాహానికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం అని ప్రకాశ్‌ రాజ్‌ తన ట్విట్‌లో తెలియజేశారు. ఈ సందర్భంగా ...

Read More »

కాంచన – 3 హీరోయిన్‌ అలెగ్జాండ్రా మృతి

కాంచన -3 మూవీ హీరోయిన్‌ రష్యన్‌ నటి అలెగ్జాండ్రా జావి అనుమానాస్పదంగా మృతి చెందారు. గోవాలో ఆమె అద్దెకుంటున్న అపార్టుమెంటు గదిలో శుక్రవారం ఉరివేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆమె చనిపోయిన మూడు రోజుల తర్వాత విషయం బయటకు రావడంతో అసలు ఆమెది ఆత్మహత్యా? లేక హత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలెగ్జాండ్రా అకస్మాత్తుగా మృతి చెందడం సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల కిందట ఆమెకు తన ప్రియుడికి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారని సినీ వర్గాల సమాచారం. మరోవైపు ఇటీవల ...

Read More »

హీరో కార్తికేయ సీక్రెట్‌గా నిశ్చితార్థం!

హీరో కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా ఆయన నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవడంతో.. సినీ పరిశ్రమ వర్గాలకు బిగ్‌ షాకిచ్చింది. అయితే ఇప్పటివరకు కార్తికేయ నిశ్చితార్థం గురించి కానీ.. కాబోయే భార్య గురించి కానీ చెప్పకుండా గొప్యంగా ఉంచడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. నిశ్చితార్థం విషయాన్ని అతను సీక్రెట్‌గా ఉంచినా.. అందరికీ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం కార్తికేయ అమెరికాలో ఉన్నాడు. అతను అక్కడి నుంచి రాగానే బిగ్‌ పార్టీతో అధికారికంగా చెబుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.కార్తికేయ ఆర్‌ఎక్స్‌ 100 ...

Read More »

భీమ్లా నాయక్‌ నుంచి వీడియోను విడుదల చేసిన చిత్రయూనిట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా  నాయక్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గ్లిమ్ప్స్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. పవన్ అగ్రసివ్‌గా రానాను వెతుకుంటూ రావడం.. అడ్డమొచ్చిన రౌడీలను చితక బాదడం ...

Read More »

‘నేనే నా’ పోస్టర్‌ విడుదల

రెజీనా కాసాండ్రా, అక్షర గౌడా ప్రధాన పాత్రల్లో కార్తీక్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నేనే నా’. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కు తోంది. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ విడుదల చేసింది చిత్రబృందం. మిస్టరీ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో వెన్నెల కిషోర్‌ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ట్రైలర్‌ త్వరలో విడుదల చేయనున్నారు. శామ్‌ సి ఎస్‌ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి గోకుల్‌ బెనారు అందిస్తున్నారు.

Read More »

‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ లో ‘పంచమి’ గా నిధి అగర్వాల్

వర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ 27వ చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్‌ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరు నిధి అగర్వాల్‌ కాగా, మరొకరు జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌. మంగళవారం నిధి అగర్వాల్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో నిధి అగర్వాల్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్‌ కనిపించనుంది. నిండుగా చీరకట్టుతో నగలు ధరించి నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మొఘల్‌ కాలం, కుతుబ్‌ షాహీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోంది.

Read More »