news

జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న భారతీయుడు-2

క‌మర్షియ‌ల్‌గా భారీ చిత్రాల‌ను అద్భుతం అని అంద‌రూ మెచ్చుకునేలా తెర‌కెక్కించ‌టంలో శంకర్ సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం ఉంటుంది. ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసే కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్ద‌రూ చేతులు క‌లిపారంటే అద్భుత‌మైన సినిమా మ‌న ముందుకు వ‌స్తుంద‌న‌టంలో సందేహం లేదు. భార‌తీయుడు తో అది నిరూపిత‌మైంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి భార‌తీయుడు 2తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాయ చేయ‌బోతున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో సినిమాపై అంచ‌నాల‌ను ...

Read More »

ఇద్దరు టాప్ డ్యాన్సర్స్ లతో మూవీ…

ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ వార్ 2 లో నటిస్తున్నాడు. ఆల్రెడీ నిన్నే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యారు. యశ్ రాజ్ స్పై ఫిలిమ్స్ లో ఎన్టీఆర్ భాగమవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వార్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. స్పై యూనివర్స్ కాబట్టి ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని ఆల్రెడీ అర్థమైపోతుంది.అయితే వార్ 2 లో ఎన్టీఆర్ –హృతిక్ రోషన్ కాంబోలో ఓ అదిరిపోయే డ్యాన్స్ సాంగ్ ఉందని సమాచారం. ఇండియాలో ...

Read More »

2026 ఎన్నికల్లో విజయ్‌‌కి పోటీగా హీరోయిన్..

తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతుంది. ఇందులో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు చాలామందే పోటీ చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ నమిత తాను కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. 2026 ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్‌పై పోటి చేస్తాను. రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది. అందుకే విజయ్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. హీరో విజయ్‌పై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా ...

Read More »

అప్పుడు గుండె బద్ధలైంది.. బయపడేందుకు టైమ్ పట్టింది

బుల్లితెరపై కెరీర్ ఆరంభించిన అమ్మాయి ఇప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే నటిగా సినీరంగంలో అడుగుపెట్టి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తనే బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. హిందీలో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు అసలైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం సీతారామం సినిమానే. టాలీవుడ్ డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సీతామహాలక్ష్మి పాత్రలో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకుంది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాతో తెలుగు ...

Read More »

మాజీ సీఎం మనవడితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్.. త్వరలో పెళ్లి?

అందాల ముద్దుగుమ్మ, అతిలోక సుందరి గారాల పట్టీ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తలుక్కుమనే అందం, మత్తెక్కించే కళ్లతో ఈ బ్యూటీ కుర్రకారు మనసును దోచేస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ హాట్ బ్యూటీ, తన అందాల సొగసులతో, వయ్యారాలు ఒలకబోస్తూ.. క్యూట్ హాట్ ఫోటో షూట్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా జాన్వీ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తుండగా, ...

Read More »

ఫుడ్ బిజినెస్‌లోకి రకుల్ ప్రీత్‌సింగ్.. ప్రత్యేకత ఇదేనట!

ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపారంలో అడుగుపెట్టిన వారి జాబితాల్లో రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా ఒకరు. ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఆమె ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్టణం తదితర నగరాల్లో ఎఫ్ 45 పేరుతో జిమ్స్ నిర్వహిస్తున్నారు. అలాగే, వెల్‌బీయింగ్ న్యూట్రిషన్, వెల్‌నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. 2019లో న్యూబూ పేరుతో బయోడీగ్రేడబుల్, రీయూజబుల్ డైపర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఇప్పుడు ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు రకుల్. ఆరంభం పేరుతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ నెల 16న ...

Read More »

అయోధ్య రామమందిరంపై మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

అయోధ్యలో బాలరాముడు కొలవు దీరాడు. జనవరి 22న బాలరాముడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్టచేశారు. అయితే త్వరలో అయోధ్యలోని రామ మందిరంపై తెలుగులో ఓ డాక్యుమెంటరీ మూవీ రాబోతుంది. రామ అయోధ్య పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో ఏప్రిల్ 17 నుంచి శ్రీరామ నవమి రోజున స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమాలో అయోధ్య రామమందిరం గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను చూపెట్టనున్నారంట. హిందువులకు ఆ నగరంతో ముడిపడిన భక్తి అనుబంధం, అయోధ్య విశేషాలు,రామ మందిర నిర్మాణ విశేషాలను మూవీ ద్వారా ...

Read More »

రామ్ చరణ్‌కు డాక్టరేట్.. పవన్ కల్యాణ్ హార్ట్ టచింగ్ .!

ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌కు చెన్నైలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఇక, రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ రావడంపై టాలీవుడ్ అగ్రహీరో, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సాధించిన రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. రామ్ చరణ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు.. డాక్టరేట్ స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని.. ...

Read More »

97వ ఆస్కార్‌ అవార్డుల వేడుక డేట్ ఫిక్స్..

ప్రపంచ సినీ పరిశ్రమలన్నీ ఆస్కార్ కోసం కలకంటాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాత సినీ అవార్డుల్లో టాప్ ఆస్కార్ అవార్డు. అది సాధించాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. మనకు కూడా రాజమౌళి, RRR వల్ల నాటు నాటు పాటకి 95వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో బెస్ట్ సాంగ్ అవార్డు వచ్చింది. ఇటీవలే మార్చ్ లో 96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. తాజాగా రాబోయే 97వ ఆస్కార్ అవార్డుల డేట్స్ అనౌన్స్ చేసింది అకాడమీ. ఈ ఏడాది డిసెంబర్ 17న ఆస్కార్ కు సినిమాల షార్ట్ లిస్ట్ ...

Read More »

వార్నర్ అంటే క్రికెటర్ అనుకుంటివా : రాజమౌళి

డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా.. ఇండియాలో కూడా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. రీల్స్, షాట్స్‌తో కరోనా టైంలో నెటిజన్లకు దగ్గరయ్యాడు. ఇక ఇంతకుముందు సన్ రైజర్స్ టీమ్‌కు ఆడి హైదరాబాదీలకు బ్రదర్ అయిపోయిన ఆయన… ఇప్పుడు వార్నర్ ఏకంగా యాక్టర్‌గా మారాడు. యాడ్‌లో దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి నటించాడు. ఇక ఈ యాడ్‌లో ముందుగా జక్కన్న కాల్ చేసి మ్యాచ్ టికెట్ కావాలని అడుగుతాడు. అది కావాలంటే తనకు సినిమా చాన్స్ ఇవ్వాలని కోరుతాడు వార్నర్. మగధీర సినిమా గెట్ అప్స్‌లో కనిపించిన ...

Read More »