News

అయ్యప్పలకు షాకింగ్ న్యూస్.. మొబైల్ పై నిషేధం..

తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప మాల వేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఇరుముడి సమర్పించారు కూడా. ఇంకా చాలా మంది మాలలో ఉన్నారు. అయితే.. పవిత్ర శబరిమల అయ్యప్పస్వామి ఆలయం యాజమాన్యం అయ్యప్పలకు షాక్ ఇచ్చింది. శబరి మల అయ్యప్పస్వామి ఆలయం గర్భ గుడి పరిసర ప్రాంతంలో సెల్‌ఫోన్ల వాడకాన్ని బ్యాన్ చేసింది. ఈ మేరకు ట్రావెన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డు ఉన్నతాధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యంత భద్రతతో కూడిన అయ్యప్ప స్వామి గర్భాలయం, స్వామి మూర్తికి ...

Read More »

పవన్ పెట్టుకున్న పేరుకు న్యాయం చేస్తున్నాడు.. అంబటి జోకులు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సార్థక నామధేయుడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్‌ తన పేరులోని పవనం, కల్యాణం రెండు పదాలకు న్యాయం చేశారని అంబటి వ్యాఖ్యానించారు. పవనం అంటే గాలి అని.. ఇవాళ పవన్‌ గాలి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజధానిపై ఏనాడూ ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపని విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఓడిపోయిన తరువాత ప్రతిపక్షాలు గుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశం పేరుతో చంద్రబాబు డ్రామాలు ...

Read More »

ఏపీలో మొదటి జీరో ఎఫ్‌ఐఆర్ కేసు..ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు

ఏపీలో మొదటి ఎఫ్‌ఐఆర్ కేసు నమోదయ్యింది. కేసు తమ పరిధిలోకి రానప్పటికి కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జిల్లాలోని వీరులపాడు మండలం రంగాపురానికి చెందిన బాలుడు కిడ్నాపునకు సంబంధించి, అతని తండ్రి కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ డివిజన్‌లోకి రానప్పటికి కంచికచర్ల పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. వెంటనే యాక్షన్ టీమ్స్‌ను రంగంలోకి దింపి, తెలంగాణలోని మిర్యాలగూడ మండలంలో బాలుడి ఆచూకి కనుగొన్నారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. దిశ హత్యాచార ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసిన సంగతి ...

Read More »

నేడు ఢిల్లీ వెళ్లనున్న జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 4.00 గంటలకు సీఎం నివాసం నుంచి బయలుదేరి 4.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం 6.15గంటలకు ఢిల్లీ ఏయిర్‌ పోర్ట్‌కు వెళ్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ​ద్వారా సాయంత్ర 7 గంటలకు జన్‌పథ్‌‌-1కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి అమరావతి చేరుకుంటారు.  కాగా, గురువారం ఉదయం అనంతపురం వెళ్లిన సీఎం జగన్‌.. పెనుకొండలో ఏర్పాటు చేసిన ...

Read More »

కత్తి మహేష్ పై పవన్ ఫాన్స్ ఫైర్..చేతికి దొరికితే అంతే అంటూ వార్నింగ్

పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డాడు కత్తి మహేష్. ఎప్పుడూ పవన్‌ను తిడుతూ వార్తల్లో ఉండే ఈయన ఇప్పుడు మళ్లీ జనసేన అధినేతపై నోరు పారేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పవన్ గురించి విమర్శించాడు. ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నాడు పవన్ కల్యాణ్. అక్కడ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. రాజకీయంగా పవన్, వైసీపీ మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతుంది. కొన్ని రోజులుగా వరసపెట్టి టార్గెట్ చేస్తూనే ఉన్నాడు పవన్. ఈ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ...

Read More »

ఉల్లి ధరలు పెరిగితే తినటం మానేయండి… ఆర్థికశాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్

ఉల్లి ధరలు పెరిగాయంటూ దేశమంతా గగ్గోలు పెడుతుంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా కూల్ తినడం మానేయమంటున్నారు. ఇదెక్కడో అన్న మాట కాదు.. సాక్షాత్తు పార్లమెంటులో విపక్షాలన్నీ ఉల్లిగడ్డల ధరలు పెరిగాయంటూ ఆందోళనకు దిగితే.. తాను ఉల్లిగడ్డలను పెద్దగా వాడనని చెబుతూనే.. ధరల మీద ఆందోళన చెందుతుంటే ‘‘ఉల్లిగడ్డలు తినడం మానేయండి’’ అంటూ ఉచిత సలహా పారేశారు తెలుగింటి కోడలు నిర్మలమ్మ. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతూనే వున్నాయి. తొలుత విదేశాలకు ఎగుమతులు ఆపేస్తే చాలు దేశంలో ఉల్లి ...

Read More »

దిశ సెల్ ఫోన్ గుర్తించిన పోలీసులు

హత్యాచారానికి బలైపోయింన దిశ సెల్ ఫోన్ ను పోలీసులు గుర్తించారు. హత్యాచారం ఘటనకు అర కిలోమీటరు దూరంలో దిశ ఫోన్ ను దోషులు భూమిలో పాతిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ తో పాటు మరికొన్ని వస్తువుల్ని కూడా గుర్తించారు. దిశపై క్రూర మగాలు చేసిన అకృత్యం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. నిందితులపై ఏమాత్రం కనికరించవద్దనీ..ఇటువంటి మావన మృగాలు సభ్య సమాజంలో తిరగటానికి వీల్లేదని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ...

Read More »

పార్లమెంట్‌కు వచ్చిన చిదంబరం

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిదంబరం పార్లమెంట్ సమావేశాలకు 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఉదయం హాజరయ్యారు. INX మీడియా కేసులో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2019, డిసెంబర్ 04వ తేదీ బుధవారం సాయంత్రం ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. 106 రోజులు జైల్లో ఉన్నారు. >

Read More »

రేప్ బాధితురాలికి నిప్పంటించిన నిందితుడు

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో జరిగిందో దారుణం. తనపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై గత మార్చిలో కేసు పెట్టిన బాధితురాలి మీద వారు పగ పెంచుకున్నారు. ఆ కేసుకు సంబంధించి బుధవారం తన గ్రామం నుంచి కోర్టుకు వెళ్తున్న 23 ఏళ్ళ ఈమెపై ముగ్గురు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమెకు 60 శాతం నుంచి 70 శాతం కాలిన గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానికులు వెంటనే మొదట దగ్గరలోని ఆసుపత్రికి… . అనంతరం మెరుగైన వైద్యం కోసం లక్నో లోని ఆసుపత్రికి ...

Read More »

కియో మోటర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జగన్

జిల్లాలోని పెనుకొండలో గల కియా ఫ్యాక్టరీ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కియా ఫ్యాక్టరీకి చేరుకున్న సీఎం.. ఈ సందర్భంగా కియా యాజమాన్యంతో సమావేశం అయ్యారు. పరిశ్రమ గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలోని అన్ని విభాగాలను సీఎం పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కియా ఫ్యాక్టరీ డాక్యుమెంటరీ చిత్రాన్ని జగన్‌ వీక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో ఏపీలో కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా సంస్థ కియా ఏర్పాటు చేసిన ...

Read More »