Crime

ప్రేమ పెళ్లి జరిగిన 20 రోజులకే అనుమానాస్పదంగా మహిళ మృతి

హైదరాబాద్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో అనుమానాస్పద మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సనత్‌నగర్‌లో నివసించే పూర్ణిమ ఓ సంస్థలో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే దాసరి కార్తీక్ అనే యువకుడిని ప్రేమించింది. పెద్దలు అంగీకరించకపోవడంతో 20 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పూర్ణిమ బుధవారం తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ...

Read More »

చిన్నారిపై మృగాళ్ల పైశాచికత్వం

. దేశమంతా దిశా పాశవిక హత్య గురించి నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ రాజస్తాన్‌లో ఓ చిన్నారి అత్యంత దారుణ పరిస్థితుల్లో శవమై తేలింది. చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు ఆమెపై అత్యాచారం చేసి అంతమొందించారు. వివరాలు.. టోంక్‌ జిల్లా ఖేతడి గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలో శనివారం స్కూళ్లో ఆటలపోటీలు ఉండటంతో తోటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపింది. అయితే మధ్యాహ్నం మూడు గంటలు దాటినా సదరు చిన్నారి ఇంటికి రాకపోవడంతో.. కంగారుపడిన తల్లిదండ్రులు ఆమె కోసం ...

Read More »

భార్యను చంపి మృతదేహాన్ని బెడ్ కింద పెట్టిన భర్త

ఛండీగఢ్: ఓ భర్త తన భార్యను గొంతు నులిమి చంపి అనంతరం మృతదేహాన్ని బెడ్ కింద పెట్టిన సంఘటన హర్యానాలోని బహదుర్గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతదేహం ఉన్న ఇంట్లో నుంచి వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రజ్వీర్ అనే వ్యక్తి లలిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. భర్తతో విభేదాలు రావడంతో ఆమె తన కూతురు, కుమార్తెతో కలిసి విడిగా ఐదు సంవత్సరాల నుంచి ఉంటుంది. లలిత కుమారుడు నిశాంత్ జన్మదినం వేడుకలు ...

Read More »

తమిళనాడులో దారుణం..మహిళ కడుపులో సూది పెట్టి కుట్టేసిన వైద్యులు?

తమిళనాడులో ఘోరం జరిగింది. ఆసుపత్రిలో ఓ మహిళకు కాన్పు చేసిన వైద్యులు ఆమె కడుపులో సూదిని వదిలేసిన ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఉచ్చిపల్లిలో చోటు చేసుకుంది. రమ్య అనే ఓ నిండు గర్భిణి ఈ నెల 19న ఉచ్చిపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కాన్పు తర్వాత రమ్యకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. కడుపు నొప్పి, రక్త స్రావంతో విల విలలాడింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు మళ్లీ ఆసుపత్రికి తీసుక వెళ్లారు. ...

Read More »

క్లాస్‌రూమ్‌లో పాముకాటు.. బాలిక మృతి

పాము కాటుకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించడంలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది కేరళ ప్రభుత్వం. ఈ ఘటన వయనాడ్‌ ప్రాంతంలోని సుల్తాన్‌ బథేరీలోని ఒకేషనల్‌ సెకండరీ స్కూల్‌లో చోటుచేసుకుంది. పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న స్నేహలా షెరీన్‌ (10) కాలు క్లాస్‌రూమ్‌లోని చిన్న రంధ్రంలో ఇరుక్కుంది. అయితే ఆ బాలికకు తన కాలును ఏదో కుట్టినట్టు అనిపించింది. ఈ విషయాన్ని పాఠం చెబుతోన్న క్లాస్‌ టీచర్‌ షీజిల్‌కు చెప్పగా.. ఆమె ఏదో గీసుకుపోయి ఉంటుందని అనుకోని తన పాఠాన్ని కొనసాగించింది. కొద్దిసేపటికి ...

Read More »

మార్ఫింగ్‌ ఫొటోలతో అశ్లీల చాటింగ్‌..!

సామాజిక మాధ్యమాల నుంచి యువతుల ఫొటోలను సేకరించాక మార్ఫింగ్‌ చేసి ఆ ఫొటోలతో ఇన్‌స్టాగ్రాం ఖాతాలు తెరుస్తున్నాడు.. ఆ ఖాతా ద్వారా యువతులతో చాటింగ్‌కు దిగేవాడు.. అయితే, అశ్లీలంగా చాటింగ్‌ చేయకపోతే మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు… అలా అంగీకరించని ఓ యువతి ఫొటోలను మిత్రులకు పంపించడంతో విషయం బయటపడగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధ్యుడైన ఇంజనీరింగ్‌ విద్యార్థిని అరెస్టు చేశారు. ధర్మారం వాసి వరంగల్‌ రూరల్‌ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి(మైనర్‌) ఇన్‌స్టాగ్రాంలోని యువతల ఫొటోలను ...

Read More »

హనీమూన్‌లో విషాదం.. నవ వరుడు మృతి

విహారయాత్రకు హిమాచ్‌ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లిన చెన్నై నవవరుడు మృతి చెందాడు. సోమవారం భార్య కళ్లెదుటే జరిగిన ఈ విషాద సంఘటన శోకాన్ని నింపింది. చెన్నై అమింజికరై తిరువీధి అమ్మన్‌ ఆలయం వీధికి చెందిన అరవింద్‌ (27). ప్రీతిలకు గత వారం వివాహం జరిగింది. అనంతరం కొత్త జంట హనీమూన్‌ కోసం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లారు. డోబీ అనే ప్రాంతంలో ప్యారాగ్లైడింగ్‌లో పర్యాటకులు విహరించడం విశేషం. దీనిని గమనించిన అరవింద్‌కు కుతూహలం ఏర్పడింది. ఇందుకోసం టికెట్‌ కొనుగోలు చేసి సోమవారం ప్యారాగ్లైడర్‌ పైలట్‌ హరూరామ్‌తో అరవింద్‌ ...

Read More »

మహిళా ఎస్‌ఐ వేధింపులు…యువకుడు ఆత్మహత్య!

పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి మందలించారనే మనస్తాపంతో కృష్ణా జిల్లాలో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నవరంలోని సొసైటీపేటలో నివసించే చిట్టూరి మురళి (21) తండ్రి చనిపోవడంతో తల్లితో కలసి టీస్టాల్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విజయవాడలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న మురళి ఆదివారం సాయంత్రం స్కూటీపై రాంగ్‌రూట్‌లో వెళ్తుండగా పాత స్టేట్‌బ్యాంక్‌ ఎదుట భర్తతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తున్న గన్నవరం మహిళా ఎస్‌ఐ పి.నారాయణమ్మ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ విషయమై ఎస్‌ఐ అతడిని మందలించడంతోపాటు పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. ...

Read More »

టీ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న భర్త

జగద్గిరిగుట్ట బాలయ్యనగర్‌లో ఆడివయ్య(35) అనే వ్యక్తి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఆటోడ్రైవర్ అయిన ఆడివయ్య ఆదివారం ఉదయం బయటకు వెళ్తూ టీ ఇవ్వాలని భార్యను అడిగాడు. తాను ఇంటి పనిలో బిజీగా ఉన్నానని, కాసేపు ఆగాలని ఆమె భర్తకు చెప్పింది. దీంతో ఆవేశానికి గురైన ఆడివయ్య భార్యతో గొడవపడ్డాడు. జ్యోతి కూడా ఎదురుతిరగడంతో మనస్తాపానికి గురై సమీపంలో ఉన్న క్వారీ గుంతలో దూకేశాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. గుంతలో నీరు నిండుగా ...

Read More »

చింతమనేని ప్రభాకర్ కు బెయిల్ మంజూరు!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఊరట లభించింది. ఆయనపై నమోదైన నాలుగు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, రేపు ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఏలూరు జిల్లా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

Read More »