Headlines

సీఎం జగన్‌ను కలిసిన నెదర్లాండ్‌ ప్రతినిధులు

సీఎం జగన్‌ను కలిసిన నెదర్లాండ్‌ ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నెదర్లాండ్‌ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో వైఎస్‌ జగన్‌తో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వారితో రాష్ట్రంలోని వివిధ రంగాలలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.

Read More »

ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్

ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల్లోగా క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం అవకాశం కల్పించారు. మొత్తం 120 మున్సిపాల్టీలతో పాటు 9 కార్పొరేషన్‌ లో ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్‌ 67.45 శాతం నమోదైంది. ఓట్లు లెక్కింపు ఈ శనివారం జరగనుంది.

Read More »

టీడీపీకి షాక్.. వైసీపీలో చేరబోతున్న ఎమ్మెల్సీ సునీత

టీడీపీకి షాక్.. వైసీపీలో చేరబోతున్న ఎమ్మెల్సీ సునీత

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నిన్న శాసనమండలిలో టీడీపీ విప్ ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఆమె ఓటు వేశారు. దివంగత పరిటాల రవి అనుచరుడు పోతుల సురేశ్ భార్య పోతుల సునీత అనే విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరడంతో… పోతుల ...

Read More »

గ్రామ సచివాలయాల పక్కనే ఆర్‌బీకే కేంద్రాలు -సీఎం జగన్

గ్రామ సచివాలయాల పక్కనే ఆర్‌బీకే కేంద్రాలు -సీఎం జగన్

గ్రామ సచివాలయాల పక్కనే ఆర్‌బీకే కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాలపై ఏపీ అసెంబ్లీలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆర్‌బీకే కేంద్రాల్లోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఖరీఫ్‌ నాటికి 11,154 కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా అక్కడే పరిష్కారిస్తామన్నారు. పంటల బీమాను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం వెల్లడించారు. ఆర్‌బీకే కేంద్రాల్లోనే సీడ్‌ టెస్ట్‌, భూసార పరీక్షలు నిర్వహిస్తామని జగన్‌ పేర్కొన్నారు. రైతు భరోసా ...

Read More »

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ బిల్లుకు ఆమోదం

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ బిల్లుకు ఆమోదం

అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదం తెలిపింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర దర్యాప్తుకు బుధవారం శాసనసభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత సభలో చదివి వినిపించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి కేబినెట్‌ సబ్‌ కమిటీ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 4,070 ఎకరాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎలా జరిగిందో అన్ని రకాల ఆధారాలతో సభలో చర్చించిన విషయాన్ని గుర్తుచేశారు. స్పీకర్‌ ...

Read More »

ఢిల్లీ బయల్దేరిన పవన్

ఢిల్లీ బయల్దేరిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. పవన్ కల్యాణ్ వెంట జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెళ్లారు. రేపు మధ్యాహ్నం వరకు పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉండనున్నారు. పలువురు బీజేపీ పెద్దలను పవన్ కల్యాణ్ కలవనున్నారు.

Read More »

లోకేష్ కి సవాల్ విసిరిన బుగ్గన

లోకేష్ కి సవాల్ విసిరిన బుగ్గన

శాసన మండలి సాక్షిగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌… టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు సవాల్‌ విసిరారు. నవరత్నాలు అమలు కోసం చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు అమ్ముకోవచ్చని ప్రభుత్వం జీవో ఇచ్చిందన్న నారా లోకేష్‌ వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం మసీదులు, చర్చిలు, దేవాలయాల భూములు అమ్ముకోవచ్చని ఎప్పుడూ జీవో జారీ చేయలేదని బుగ్గన స్పష్టం చేశారు. ఆ జీవో ఎక్కడుందో చూపించాలని సవాల్‌ విసిరిన బుగ్గన, కనీసం ఆ జీవో నెంబర్‌ అయినా చెప్పాలన్నారు. జీవో చూపించలేకపోతే సభకు నారా ...

Read More »

టీడీపీ సభ్యులపై మండిపడ్డ ఆర్కే

టీడీపీ సభ్యులపై మండిపడ్డ ఆర్కే

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వైఖరిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. సభ్యుల ప్రవర్తన గురించి రూల్స్‌బుక్‌లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల్లాగా తామెప్పుడూ ప్రవర్తించలేదన్నారు. గతంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు తీర్మానం చేస్తే తాము బలపరిచిన విషయాన్ని గుర్తు చేశారు.ఇక సోనియా, చంద్రబాబు కుమ్మక్కై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అయితే 23 కేసుల్లో స్టే తెచ్చుకున్న వ్యక్తిగా చంద్రబాబును పేర్కొన్నారు. ...

Read More »

టీడీపీ పై రెచ్చిపోయిన అబ్బయ్య చౌదరి

టీడీపీ పై రెచ్చిపోయిన అబ్బయ్య చౌదరి

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి రైతు భరోసా కేంద్రాలపై చర్చ ప్రారంభించారు. రైతులపై చర్చ జరుగుతుండగా అడ్డుపడిన టీడీపీ సభ్యుల వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రైతుల ద్రోహి అని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక నిధులు కేటాయించిందని తెలిపారు. చెప్పినదానికంటే అధికంగా రైతు భరోసా అమలు చేస్తున్నామని చెప్పారు. సహకార సంఘాలను నిర్వీర్యం చేసిన చరిత్ర టీడీపీదని దుయ్యబట్టారు. రైతులను కాల్చిచంపిన బషీర్‌బాగ్‌ ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ...

Read More »

రజనీకాంత్ వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టుకెక్కిన ద్రవిడర్ కళగమ్

రజనీకాంత్ వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టుకెక్కిన ద్రవిడర్ కళగమ్

ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్‌ (ఈవీ రామస్వామి నాయకర్)పై సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల దుమారం ఆగడం లేదు. పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేది లేదని రజనీ ఇప్పటికే స్పష్టం చేశారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తేల్చి చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ ద్రవిడర్ కళగమ్ కార్యకర్తలు గత కొన్ని రోజులుగా రజనీ ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నారు. తాజాగా, రజనీకాంత్‌పై చర్యలు తీసుకోవాలంటూ ద్రవిడర్ కళగమ్ కార్యదర్శి నిన్న మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు ...

Read More »