National

తమిళనాట సంచలనం రేపుతున్న రజిని, కమల్ వ్యాఖ్యలు !

కోలివుడ్‌ వెండితెర వేల్పులైన కమల్‌హాసన్, రజనీకాంత్‌ నాడు వెండితెరపై నేడు రాజకీయతెరపై “సరిలేరు మాకెవ్వరు’ అన్నట్లుగా వ్యవహరించడం ప్రారంభించారు. నాలుగు దశబ్దాలుగా స్నేహానికే పరిమితమైన వారిద్దరూ ఇక రాజకీయ భాగస్వాములం అంటూ కొత్త అంశానికి తెరదీశారు. ప్రజల కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమని కమల్, రజనీ చేసిన కామెంట్లు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేల కూటములను మట్టికరిపించేందుకు సరికొత్త వ్యూహం సిద్ధం అవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రజనీ వర్సెస్‌ అన్నాడీఎంకే 1996 నాటి ఎన్నికల సమయంలో అప్పటి ...

Read More »

స్పీకర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఎమ్మెల్యే!

ఒడిశా అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒడిశాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభా కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో.. ఒక్కో ఎమ్మెల్యే తమ నియోజకవర్గ సమస్యలను సభలో వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన పని సభలోని అందరిచేత నవ్వుల పువ్వులు పూయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి శాసనసభ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ ఎస్ఎన్ పాత్రోకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అయితే, ఇందులో వేరే ఉద్దేశం లేదని, తన నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని ...

Read More »

కమల్‌ జన్మదినోత్సవ సంబరాల్లో రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు !

సీఎం అయ్యేందుకు ఏళ్లతరబడి కలలు కనక్కరలేదు.. సీఎం కావాలని ఏనాడైనా ఎడపాడి కలలు కన్నారా, అలాగే రేపు ఎవరైనా సీఎం కావచ్చు సూటిగా పేరుపెట్టి ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరోకాదు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఆశ్చర్యకరమైన పరిణామాలూ చోటుచేసుకుంటాయని మరో బాంబు పేల్చి కలకలం రేపారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చనే ఉదాహరణకు తమిళనాడు రాజకీయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. జయలలిత హఠాన్మరణం వల్ల అన్నాడీఎంకేలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. జయలలిత హయాంలో చక్రం తిప్పిన శశికళ జైలు ...

Read More »

బ్యాంకు డిపాజిటర్లకు శుభవార్త..!

బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వినియోగదారులకు మరింత భరోసా కల్పించేలా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి శుభవార్త అందనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ బీమా పరిమితిని ఊహించిన దానికంటే ఎక్కువ పెంచనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రూ .1 లక్ష నుండి రూ .5 లక్షలకు పెంచవచ్చనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. హోల్‌సేల్ డిపాజిటర్లకు డిపాజిట్ బీమాను రూ.25 లక్షలకు పెంచే కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ‘బిజినెస్ స్టాండర్డ్’ తెలిపింది. ఈ పెంపు అమల్లోకి వస్తే, డిపాజిట్ బీమాకు ...

Read More »

ఆరోజు అలా అవుట్ అవ్వడానికి ధోని నే కారణం !

అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని టార్గెట్‌ చేసే మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ మరోసారి విమర్శలు గుప్పించాడు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ఉదహరిస్తూ ధోనిపై మండిపడ్డాడు. ఆ మ్యాచ్‌లో తాను సెంచరీని మూడు పరుగుల దూరంలో కోల్పోవడానికి కారణం ధోనినే అంటూ విమర్శించాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ధోని సారథ్యంలో టీమిండియా కప్‌ను సగర్వంగా అందుకుంది. ఆ వరల్డ్‌కప్‌ ఫైనల్లో శ్రీలంక 275 పరుగుల టార్గెట్‌ను ...

Read More »

నేటి నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు..!

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఆదివారం అఖిలపక్ష సమావేశంనిర్వహించారు. అఖిల పక్ష సమావేశానికి మొత్తం 27 పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యాయి. శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 13 వరకు సాగుతాయి. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి సమావేశాలు అత్యంత ఫలప్రదం కావడంతో ఈసారీ అదే పంథా కొనసాగించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అలాగే, ఈ పార్లమెంటు సమావేశాల్లో 70వ రాజ్యాంగ దినోత్సవం, రాజ్యసభ 250వ సమావేశ ఉత్సవాలనూ ఘనంగా ...

Read More »

రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: పదిమంది మృతి

రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తీవ్రంగా గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బికనీర్‌ నుంచి ప్రయాణికులతో వస్తున్న బస్సును 11వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రక్కు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి వారు చెబుతున్నారు. ...

Read More »

సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఇదేరోజు !

ప్రపంచ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ శకం నడిచిందంటే అతిశయోక్తి కాదు. తాను క్రికెట్‌ ఆడిన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతలు మరెన్నో అద్భుతాలు సచిన్‌ సొంతం. క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్ అనే స్థాయికి తన ఆటను తీసుకువెళ్ళాడు ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌. మొదటగా సచిన్ తన 16 ఏళ్ల వయసులో 1989 నవంబర్ 15 న పాకిస్తాన్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.. ఆ మ్యాచ్ లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి వకార్ ...

Read More »

మరో 25 సంవత్సరాలు మహారాష్ట్ర సీఎంగా ”శివసేన నేత”!

‘మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి శివసేన నుంచే’ అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే శివసేన నేత రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారా? లేదా ఐదేళ్లు ఉంటారా? అన్న ప్రశ్నకు స్పందించారు. ‘ఐదేళ్ల గురించి ఎందుకు చర్చించుకోవాలి? మరో 25 ఏళ్లు మహారాష్ట్రకు సీఎంగా శివసేన నేతే ఉండాలని మేము కోరుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ, కాంగ్రెస్ తో చర్చల విషయంపై ...

Read More »

రజనీకాంత్ వ్యాఖ్యలను సమర్ధించిన కమల్ హాసన్ !

తమిళనాడులో రాజకీయ సంక్షోభం నెలకొందంటూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను మరో నటుడు, మక్కళ్ నీది మయ్యమ్ చీఫ్ కమల హాసన్ సమర్థించారు. గతవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ.. తమిళనాడులో సరైన నాయకుడు లేడని, అధికార, ప్రతిపక్షాల తీరుతో రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. తాజాగా, కమలహాసన్ మాట్లాడుతూ.. రజనీకాంత్ వ్యాఖ్యలను సమర్థించారు. రాష్ట్రంలో నాయకత్వం లోపించిందని అన్నారు. గతంలో ఇక్కడ మంచి నాయకులు ఉండేవారని, ఇప్పుడు రాజకీయ సంక్షోభం నెలకొందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకులే ...

Read More »