News

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ‌ వేడుక‌లు

యువజన శ్రామిక రైతు (వైఎస్ఆర్) కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి(మార్చి 12,2021) ప‌దేళ్లు నిండాయి. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జ‌రుపుకుంటున్నారు. 11వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న వైసీపీ ప్ర‌స్థానాన్ని ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే రోజా

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా.. నగిరి శాసన సభ్యురాలు ఆర్‌.కె.రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం నగరి మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు లోని హిక్స్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో రోజా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Read More »

ప్రథమ పౌరుని హోదాలో తొలిసారిగా ఓటేసిన గవర్నర్

ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ పౌరుని హోదాలో తొలిసారిగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం రాజ్‌భవన్‌కు సమీపంలోని చుండూరి వెంకట రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్‌లో గవర్నర్‌ దంపతులు ఓటేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ… ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యమని, ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సమాజంలో మార్పు రావాలంటే ఓటు హక్కు వినియోగించుకోవడం తప్పనిసరి అని అన్నారు. స్థానిక ఎన్నికలైన, మున్సిపల్‌ ఎన్నికలైన, జనరల్‌ ఎన్నికలైనా… ఓటు హక్కును ...

Read More »

మూడు జిల్లాల ఎన్నికలపై ఎస్‌ఇసి ప్రత్యేక దృష్టి

పోలింగ్‌ కోసం మొత్తం 7,915 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లలో 4,626 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 3,289 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. కార్పొరేషన్లలో 1,235 సమస్యాత్మక, 1,151 అతి సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మున్సిపాలిటీల్లో 1,233 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మున్సిపాలిటీల్లో 1,169 అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పోలింగ్‌ విధులకు 48,723 మంది సిబ్బంది హాజరయ్యారు. ఏదైనా కారణాలతో పోలింగ్‌ నిర్వహించలేకపోతే 13న రీపోలింగ్‌హొనిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల ...

Read More »

ప్రధాని మోడికి జగన్‌ లేఖ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ రాశారు. స్వయంగా కలిసి సమస్యను వివరించేందుకు అవకాశం ఇవ్వాలంటూ.. ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌ను కోరారు. అఖిలపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులను ఢిల్లీకి తీసుకొస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపడానికి నాలుగు ప్రత్యామ్నాయాలను లేఖలో సూచించారు. రూ.22 వేల కోట్ల స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను ఈక్విటీగా మార్చాలని, దీనివల్ల పరిశ్రమపై వడ్డీ భారం తగ్గుతుందని జగన్‌ తెలిపారు.

Read More »

చిలకలూరిపేట మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌!

రాష్ట్ర వ్యాప్తంగా రేపు (10వ తేదీ)న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా చిలకలూరిపేట మున్సిపాలిటీ కూడా ఎన్నికలు జరగవలసి ఉంది. అయితే, గతంలో చిలకలూరిపేట మున్సిపాలిటీలో 34 వార్డులే ఉండగా.. గతేడాది మున్సిపల్‌ ఎన్నికల సమయానికి విలీన గ్రామాలైన గణపవరం, పసుమర్రు, మానుకొండవారి పాలెంలతో కలిపి 38 వార్డులుగా పున్ణవ్యవస్థీకరించారు. అయితే కరోనా కారణంగా నామినేషన్ల ప్రక్రియ వరకు కొనసాగి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో నాదెండ్ల మండలం గణపవరం, ...

Read More »

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘ఉక్కు ఫ్యాక్టరీలో మీకు నయాపైసా వాటా లేదు. మొత్తం అమ్మేస్తాం ‘ అన్న కేంద్రం ప్రకటన ఉత్తరాంధ్ర ప్రజల రక్తాన్ని ఉడికించింది. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పరిశ్రమను ఆంధ్రుల హక్కుగా భావిస్తుంటే.. ప్రయివేటీకరణ అనే ఒక్క పదంతో మీకు సంబంధం లేదనడంతో, తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. పరిశ్రమల కోసం వేల ఎకరాల భూముల్ని త్యాగం చేస్తే, ఇప్పుడు నడిరోడ్డున పడేస్తే ఊరుకుంటామా ? అని ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. నిన్న రాత్రి నుండి ...

Read More »

భగ్గుమంటోన్న విశాఖ ఉక్కు కార్మికులు

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్లో వంద శాతం వాటాలను కేంద్రం కలిగి ఉందని, వాటిని ప్రయివేట్‌ సంస్థలకు విక్రయిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంట్‌లో చేసిన ప్రకటనపై ఉక్కు కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రకటనను నిరసిస్తూ.. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కూర్మన్నపాలెం కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో, పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ ...

Read More »

విశాఖ ఉక్కును అమ్మే తీరతాం.. నిర్మలా సీతారామన్‌

విశాఖ ఉక్కు కోసం ఓవైపున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నా.. కేంద్రానికి మాత్రం చీమకుట్టినట్లుగా కూడా లేదు. పైగా విశాఖ ఉక్కును అమ్మేస్తామని, 100శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నామని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో సోమవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. లోక్‌సభలో వైసిపి ఎంపి ఎంవివి సత్యనారాయణ లేవనెత్తిన ప్రశ్నపై ఆమె స్పందిస్తూ.. విశాఖ ఉక్కు వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఈక్విటీ షేర్‌ లేదని బదులిచ్చారు. మెరుగైన ఉత్పత్తి కోసమే ప్రయివేటీకరిస్తున్నట్లు సమర్థించుకున్నారు. 

Read More »

మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నజగన్

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. సిఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. మహిళలకు సిఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపి, కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ.. పాదయాత్రలో మహిళల కష్టాల్ని చూశానన్నారు. మహిళలకు సగభాగం ఇస్తున్నామా, లేదా అని ఆలోచించుకోవాలన్నారు. మహిళల సేవలకు ఆర్థిక కొలమానాలు లేవని చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించాలన్నారు. అమ్మ ఒడి ద్వారా రూ.13,022 కోట్లు, వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా రూ.4,604 కోట్లు, ఇళ్ల స్థలాల ద్వారా ...

Read More »