News

ఓటు వేసిన ర‌జ‌నీకాంత్‌, ధ‌నుశ్‌, విజ‌య్ సేతుప‌తి

లోక్‌సభ ఎన్నికలు 2024కి సంబంధించి మొద‌టి ద‌శ‌ ఓటింగ్ శుక్ర‌వారం (ఏప్రిల్ 19న) ప్రారంభమైంది. త‌మిళనాడులో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మొద‌టి ద‌శ లోక్‌సభ ఎన్నికలలో భాగంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని పోయెస్ గార్డెన్ పోలింగ్ బూత్‌లో త‌న‌ ఓటు వేశారు. ఆయ‌న‌తో పాటు నటులు ధనుశ్‌, విజయ్ సేతుపతి కూడా తమ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. నటుడు ధనుశ్ టీటీకే రోడ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్‌లో ఓటు వేయ‌గా, కిల్‌పాక్‌లోని చెన్నై హైస్కూల్‌లో విజయ్ సేతుపతి ఓటు వేశారు. ...

Read More »

పవన్ కళ్యాణ్ కు షాక్.. ఇవాళ పిఠాపురంలో అడుగుపెట్టనున్న సీఎం జగన్ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తన బస్సు యాత్రను కొనసాగించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ బస్సు యాత్రలో భాగంగా ఇవ్వాల ఉదయం ఎస్టి రాజపురం రాత్రి బస చేసిన నుంచి బయలుదేరుతారు జగన్. ఆ తర్వాత రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ ...

Read More »

సీఎం జగన్‌పై దాడి కేసు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే ఈ దాడి అంశం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. సీఎం జగన్‌పై దాడి చేయించింది టీడీపీ నేతలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై పథకం ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదన్నారు. ...

Read More »

రేపటి నుంచి రేవంత్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదిగో!

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కేరళ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రేపు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడతారు. రేపు సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ...

Read More »

ఒకే కారులో తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్, హరీశ్ రావు

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒకే కారులో కలిసి వచ్చారు. హరీశ్ రావు, కేటీఆర్‌లకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ పదిహేడు లోక్ సభ ...

Read More »

ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులపై స్పందించిన కేసీఆర్

ఎన్నికల సంఘం తనకు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం స్పందించారు. వివరణ ఇచ్చేందుకు తనకు మరో వారం రోజులు గడువు కావాలని కోరారు. ఇటీవల సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌పై, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఆయన విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు గాను గురువారం ఉదయం 11 గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ...

Read More »

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న ఆర్కే

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు పేరును చార్జ్ షీట్ లో తెలంగాణ ఏసీబీ 22 సార్లు ప్రస్తావించిందని… అయినప్పటికీ చంద్రబాబు పేరును నిందితుడిగా చేర్చలేదని పిటిషన్ లో ఆళ్ల పేర్కొన్నారు. అయితే, ఈ కేసు విచారణను సెలవుల తర్వాత చేపట్టాలని తెలంగాణ ...

Read More »

సీఎం జగన్ పై రాయి దాడిలో బోండా ఉమా హస్తం..!

సీఎం జగన్ పై రాయి దాడిలో బోండా ఉమా హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని. విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి పై కేశినేని నాని, వెళ్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయ వాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ….సీఎం జగన్ పై రాయి దాడిలో బోండా ఉమా హస్తం ఉందని ఫైర్‌ అయ్యారు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా అతని ఇద్దరి కుమారులు రౌడీ యిజం చేస్తన్నారని ఆగ్రహించారు. బోండా ఉమా ...

Read More »

నేటి నుంచి నామినేషన్లు

APలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలు, ఒక MLA స్థానంలో ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసుకోవచ్చు. ఉ.11-మ. 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం సెలవు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.

Read More »

ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు.. చంద్రబాబు ఆయనకు షాకిచ్చారు: విజయసాయిరెడ్డి

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో పచ్చపార్టీ ఆ టికెట్‌ను వేరొకరికి ఇచ్చిందని ఆరోపించారు. దీంతో ...

Read More »