News

ఎన్నికల తరువాత గల్ఫ్ పాలసీ తీసుకొస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ లోపు గల్ఫర్ కార్మికుల కోసం ప్రణాళిక రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గల్ఫ్ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల తరువాత గల్ఫ్ పాలసీ తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధి పై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ఆ కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ గల్ఫ్, ఓవర్సిస్ వర్కర్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయించామన్నారు. కార్మికుల సహాయార్థం ప్రజా భవన్ లో ప్రత్యేక కార్యాలయం ...

Read More »

బందిపోటు రాజకీయమే చంద్ర‌బాబు పాలన మార్క్!

అయ్యా చంద్రబాబూ.. నీ 14 ఏళ్ల అమోఘమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీతోపాటు నీ ముఠాలో ఉన్న ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఇలా అందరూ ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నారో.. రాష్ట్ర భవిష్యత్తును ఎంత నాశనం చేశారో ప్రజలంతా చూశారు. పెత్తందార్ల ముఠాకు చంద్రబాబు నాయకుడనేది ప్రజలందరికీ తెలిసిపోయింది అని సీదిరి అప్పలరాజు అభివ‌ర్ణించారు.చంద్రబాబు తొత్తుగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏదేదో మాట్లాడాడు. ...

Read More »

గ‌ణ‌ప‌వ‌రంలో సీఎం జగన్ కు ఘ‌న స్వాగ‌తం ..

మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర ద్వారా గ‌ణ‌ప‌వ‌రం చేరుకున్న సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డికి స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప్రజలతో మమేకమవుతూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. నిడమర్రు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ బస్సుయాత్రకు పల్లెలు- అడుగడుగునా అక్కచెల్లెమ్మల నీరాజనాలు ప‌లికారు. తన కోసం వేచి చూస్తున్న అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను బస్సు దిగి స్వయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్‌. సీతారామపురం చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ బస్సుయాత్రకు మ‌హిళ‌లు గుమ్మ‌డికాయ‌ల‌తో దిష్టి తీశారు. హార‌తులు ప‌ట్టి ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. గణపవరం ...

Read More »

BRS అభ్యర్థులకు ఈనెల 18న బీఫామ్‌ల అందజేత

బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులను ఈనెల 18వ తేదీన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీఫామ్‌లు అందజేయనున్నారు. అంతేగాకుండా.. ఎన్నికల ఖర్చుల నిమిత్తం అభ్యర్థులకు నియమావళిని అనుసరించి రూ.95 లక్షల రూపాయల చెక్కును అందించనున్నారు. అనంతరం అదేరోజు జరిగే సుధీర్ఘ సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసన సభ్యులు, ఎంఎల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్ పీ ...

Read More »

రానున్న ఎన్నికల్లో పెత్తందారుల ఓటమి తప్పదు – సీఎం జగన్

తన మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల్లో పెత్తందారుల ఓటమి తప్పదు అని, ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర కృష్ణా జిల్లాలో రెండో రోజు కొనసాగింది. గన్నవరం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడ చేరుకుంది. నాగవరప్పాడులో మేమంతా సిద్ధం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ...

Read More »

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో ఆమె విచారణ వాయిదా పడింది. అయితే ఈ నెల 22న లేదా 23వ తేదీన న్యాయస్థానం వాదనలు విననుంది. మద్యం కేసులో తాను నిర్దోషినని, తనపై అక్రమంగా కేసు పెట్టారని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు ...

Read More »

వైసీపీలో చేరిన ఆ రెండు పార్టీల నేతలు..

ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో సిఏం వైయస్ జగన్ సమక్షంలో పలువురు టీడీపీ, జనసేన కీలక నేతలు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధంలో భాగంగా నెడు ఉదయం బస్సు యాత్ర సమయంలో జగన్ సమక్షంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జనసేన పార్టీ కీలక నేత చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్‌ అశోక్‌ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు, తెలుగుదేశం పార్టీ నుంచి పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్‌.పేరయ్య, ...

Read More »

సివిల్స్ ఫలితాల విడుదల.. మూడో ర్యాంకు సాధించిన అనన్య రెడ్డి

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. 2023 సంవత్సరానికి గాను మొత్తం 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ కోటాలో 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ కేటగిరీ నుంచి 165 మంది, ఎస్టీ నుంచి 86 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ కు 180 మంది, ...

Read More »

సీఎం జగన్పై దాడి కేసులో పురోగతి!

విజయవాడలో సీఎం జగన్పై రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఐదుగురు అనుమానితులు ఉండగా.. వారిలో ఒక యువకుడు దాడి చేసినట్లు సమాచారం. దాడి చేసిన వ్యక్తి అజిత్సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వాడిగా భావిస్తున్నారు. సీసీ కెమెరాలు, ఇతర వీడియోల్లో నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read More »

రూ.2లక్షల రుణమాఫీ.. మంత్రి కీలక విజ్ఞప్తి

రూ.2లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని.. అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకులను కోరారు. CM, డిప్యూటీ CM, అధికారులతో చర్చించి రుణమాఫీ చేస్తామన్నారు. అటు రైతుభరోసా సాయం కోసం ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించి, సొమ్ము అందిస్తామన్నారు. ఇక వానాకాలం సీజను సంబంధించి పంటలకు అవసరమైన విత్తన సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Read More »