News

కర్ణాటక సీఎం సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు సమన్లు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కోర్టు ముందు హాజరుకావాలంటూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 28న కోర్టులో హాజరుకావాలని జడ్జి ఆదేశాలిచ్చారు. బీజేపీ పరువు తీసేలా పేపర్లలో ప్రకటనలు ఇచ్చారంటూ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ ఎస్.శివప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై 40 శాతం కమిషన్ ఆరోపణలు ...

Read More »

పీఆర్సీనే ఇస్తామంటున్నాం కదా… ఇక మధ్యంతర భృతి ఎందుకు..?

ఏపీ మంత్రివర్గ ఉపసంఘం నేడు విజయవాడలో రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీతో సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. పూర్తిస్థాయి పీఆర్సీ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉద్యోగులకు కూడా ఆ మాటే చెప్పామని వెల్లడించారు. పీఆర్సీ ఆలస్యమైనప్పుడే మధ్యంతర భృతి ఇస్తారని, పూర్తిస్థాయిలో పీఆర్సీనే ఇస్తామంటున్నప్పుడు ఇక మధ్యంతర భృతి ఎందుకని ప్రశ్నించారు. మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదని, ఒకవేళ పీఆర్సీ ఆలస్యమైతే అప్పుడు మధ్యంతర భృతి గురించి ఆలోచిస్తామని ...

Read More »

ఫిబ్రవరి 27 నుంచి మరో రెండు హామీల అమలు: సీఎం రేవంత్ రెడ్డి

మేడారం జాతరకు విచ్చేసి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆరు గ్యారెంటీల అమలుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఆ హామీల అమలుకు తామందరం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 27 సాయంత్రం మరో రెండు హామీల అమలుకు శ్రీకారం చుట్టనున్నామని… 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా హాజరవుతున్నట్టు ...

Read More »

ఉద్యోగుల ఐఆర్‌పై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ఉద్యోగుల ఐఆర్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాల సమస్యలపై చర్చించిన ఆయన ఐఆర్ ఆలోచన ప్రభుత్వ విధానం కాదని తేల్చి చెప్పారు. పీఆర్సీని మాత్రం చెప్పిన సమయానికి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 27న ఉద్యోగులు చేపట్టనున్న ఛలో విజయవాడను విరమించుకోవాలని కోరామని, సానుకూల నిర్ణయం ఉంటుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. పీఆర్సీని పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 4,5 అంశాలపై ఉద్యోగులు పట్టుబడుతున్నారని బొత్స చెప్పారు. వాటిపై కూడా త్వరలో నిర్ణయాలు ప్రకటిస్తామని తాము ...

Read More »

నిందితురాలిగా మార్చిన సీబీఐ.. కవితను విచారణకు రావాలని సమన్లు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఈనెల 26న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకావాలని 41ఏ కింద సమన్లు జారీ చేసింది. వాస్తవానికి 26న విచారణకు రావాలని సీబీఐ ఇంతకు ముందే నోటీసులు ఇచ్చింది. అయితే గత నోటీసుల్లో ఆమెను సాక్షిగా పేర్కొన్న సీబీఐ… దాన్ని సవరిస్తూ ఇప్పుడు నిందితురాలిగా పేర్కొంది. ఈ పరిణామం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది. ...

Read More »

తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీ

సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఇరిగేషన్ డిపార్టమెంటు స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేసిన ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. ఆ స్థానంలో కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని నియమించారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్‌ బాషాను జనగాం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. అక్కడి కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించారు. ...

Read More »

మేడారం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి… వనదేవతలకు పూజలు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా పేరుగాంచిన మేడారం జాతర అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మేడారం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన ఆయనకు మంత్రి సీతక్క, అధికారులు ఘనస్వాగతం పలికారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆచార సంప్రదాయాలను అనుసరించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. మేడారం జాతరలో సీఎంతో పాటు అమ్మవార్ల దర్శనం చేసుకున్నవారిలో మంత్రులు శ్రీధర్ ...

Read More »

మేడారం జాతర వేళ గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం

మేడారం జాతరను సందర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇక్కడి పరిసరాల్లోని ఆరు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా, రాష్ట్ర మంత్రి సీతక్కలతో కలిసి సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, వరుసగా మూడుసార్లు ఈ జాతరకు రావడం తన అదృష్టమన్నారు. గవర్నర్ హోదాలో ఆరేండ్ల కాలంలో మూడోసారి ఇప్పుడు దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ జరుగుతున్న ...

Read More »

అంత సీన్ లేదు.. షర్మిలపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. షర్మిల పాత్ర ‘వ్యూహం’ సినిమాలో ఉంటుంది కానీ ఏం చేయరన్నారు. రియల్ లైఫ్ లో కూడా సీఎం జగన్ కు షర్మిల ఏం చేయలేదా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ బదులిస్తూ.. జగన్ జైలులో ఉన్నప్పుడు.. ఆయనకు బయటకు రావడానికి యాక్సెస్ లేనప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చారన్నారు. ప్రజలు షర్మిలలో జగన్‌ను చూసుకోవడానికే మీటింగ్‌లకు ...

Read More »

శ్రీవారి భక్తులకు శుభవార్త ..

శ్రీ వేంకటేశ్వరా స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ మేరకు నేడు అంగ ప్రదక్షిణ టోకెన్లను అధికారులు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించి టోకెన్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో పెట్టనుంది. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టోకెన్లు సైతం ఆన్‌లైన్ అందుబాటులో ఉండనున్నాయి. స్వామి వారి శీఘ్రంగా ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ...

Read More »