Politics

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె ఇవాళ్టికి 16వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు రోజుకో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈమేర‌కు  ఆదివారం అన్ని డిపోల వద్ద కార్మికులు నిరసన ప్రదర్శనలు చేయనున్నారు. సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రం (ఎస్‌వికె) లో అఖిలపక్షాలతో ఇవాళ ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ కానున్నారు. నిన్నటి బంద్‌లో పోలీసుల తీరుపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Read More »

నేడు విశాఖలో గవర్నర్‌ హరిచందన్‌ పర్యటన

నేడు విశాఖలో గవర్నర్‌ హరిచందన్‌ పర్యటన

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలో జరిగే ఐఐపీఈ కార్యక్రమంలో గవర్నర్‌ హరిచందన్‌ పాల్గొననున్నారు.

Read More »

అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ గుడ్ న్యూస్

ys jagan relased funds for agri gold victims

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.263.99 కోట్లు విడుదల చేసిందని, సంస్థలో రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన దాదాపు 3.70 లక్షల మందికి వెంటనే పైకం చెల్లిస్తారని అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్‌ లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. డీఎల్‌ఎస్‌ ద్వారా వారి వారి ఖాతాలలో ఆ మొత్తం జమ అవుతుందని ఆయన తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితులెవ్వరూ అధైర్య పడవద్దని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ దిశలో సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని, త్వరలోనే రూ.20 వేల లోపు ...

Read More »

సాగర్ లోకి దూసుకెళ్లిన కారు వెలికితీత..ఆరుగురు మృతి

car fell into nagajunasagar incident latest updates

సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం చాకిరాల వద్ద శుక్రవారం రాత్రి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడిపోయిన  స్కార్పియో వాహనాన్ని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు  శనివారం బయటకు తీశాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. గతరాత్రి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ శనివారం మధ్యాహ్నానికి గానీ స్కార్పియోను బయటకు తీయలేక పోయారు.   హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో ఉన్న అంకుర్ హాస్పిటల్‌లో పనిచేస్తున సిబ్బంది తమ తోటి ఉద్యోగి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి ...

Read More »

విజయసాయి రెడ్డికి బాలయ్య అల్లుడి కౌంటర్

sribarath counter to vijaysaireddy

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె, చిన్న అల్లుడు శ్రీ భరత్ మతుకుమిల్లి ఆస్తులను ఆంధ్రా బ్యాంక్ వేలం వేయనున్నట్లు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీ భరత్ కుటుంబం ఆంధ్రా బ్యాంక్‌కు రూ.13 కోట్లకుపైగా బకాయి పడిందని తెలుస్తోంది. దీంతో ఆస్తుల వేలానికి ఆంధ్రా బ్యాంకు ప్రకటన ఇచ్చింది. మెస్సర్ వి.బి.సి రెన్యువేబిల్ ఎనర్జీ సంస్థతోపాటు.. బాలయ్య చిన్న కూతురు తేజస్విని, అల్లుడు శ్రీ భరత్‌, వంకిన రమేశ్ చంద్ర చౌదరి, జాస్తి రామకృష్ణ చౌదరి, బిశ్వజిత్ మిశ్రా ...

Read More »

హుజూర్ నగర్‌లో మాఅక్క గెలుపు ఖాయం

revanth reddy huzurnagar election camapign latest updates

కేటీఆర్ నిజామాబాద్‌లో వాళ్ళ చెల్లెను గెలిపించుకోలేకపోయాడని.. తాను మాత్రం హుజూర్ నగర్‌లో తన అక్క పద్మావతి రెడ్డిని గెలిపించుకుంటానని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పరాకాష్ఠకు చేరుకుందని.. నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బంద్‌కు కేసీఆరే కారణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని మంత్రుల బాధ్యతారాహిత్య వ్యాఖ్యలే కార్మికుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. తెలంగాణ ప్రజల రక్తమాంసాలను కేసీఆర్ ఇంధనంగా వాడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల చావులకు కేసీఆర్‌దే బాధ్యత అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో ...

Read More »

పవన్ కు షాక్ ఇచ్చిన రాపాక..జగన్ కు పాలాభిషేకం

rapaka varaprasad palabishekam to jagan

జనసేన పార్టీకి షాక్ తగలబోతున్నది.. ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇబ్బందిగా మారిందా అంటే అవుననే అంటున్నారు సంఘటనలు. జనసేన అధినేత పవన్ ఓవైపు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం పాజిటివ్ గా స్పందించారు. జగన్ చిత్రపటానికి ఏకంగా పాలాభిషేకం చేయటం విశేషం. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటోవాలాలకు ఏడాదికి 10వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది సర్కార్. అందుకు కృతజ్ణతగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ...

Read More »

జూబ్లీబస్టాండ్‌ వద్ద కోదండరాం అరెస్ట్

kodandaram arrest at jubliee busstand

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ వద్ద బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్‌ చేశారు

Read More »

మెదక్ ఎస్పీ చందనాదీప్తి వివాహానికి హాజరైన జగన్ కెసిఆర్

medhak sp chandana deepthi wedding

హైదరాబాద్‌లో మెదక్ ఎస్పీ చందనా దీప్తి వివాహ వేడుక వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బలరాం రెడ్డిని ఆమె పెళ్లి చేసుకుంది. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్‌లో వీరి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. చందనా దీప్తి-బలరాంరెడ్డి పెళ్లికి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎ కేసీఆర్ విడివిడిగా హాజరయ్యారు. మెదక్ ఎస్పీ చందనా దీప్తి- పారిశ్రామిక వేత్త బలాంరెడ్డి వివాహానికి హాజరైన తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మెదక్ ఎస్పీ చందనా దీప్తి- పారిశ్రామిక వేత్త బలాంరెడ్డి వివాహానికి హాజరైన మంత్రి ...

Read More »

నేడు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా తెలంగాణ బంద్

telengana band today rtc strike in telengana

ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్‌ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌లో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్‌ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బంద్‌ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది

Read More »